జాతీయ వార్తలు

రాహుల్ సారీ చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: రాఫెల్ ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై, రక్షణ శాఖపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాఫెల్ ఒప్పందంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తనంతరం రెండు తెలుగురాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ, కే లక్ష్మణ్, పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఢిల్లీలో మీడియాతో విడివిడిగా మాట్లాడారు. రాఫెల్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వాస్తవాలు తెలిశాయని కన్నా స్పష్టం చేశారు. రాఫెల్ ఒప్పందం విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు పెద్దస్కాం బయటపెడతానని చెప్పి లేని కుంభకోణాన్ని సృష్టించారని ఆరోపించారు. టీడీపీ ఓ డ్రామా కంపెనీ అని, ప్రస్తుతం ఆ పార్టీని ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరని ఆయన విమర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్ల కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా ఉండాలని కన్నా హెచ్చరించారు. చంద్రబాబుతో స్నేహం చేస్తే తెలంగాణలో మాదిరిగా మళ్లీ చేతులు కాల్చుకుంటారని ఆయన అన్నారు. కాపు, వాల్మీకి, బోయ రిజర్వేషన్లపై హోమంత్రి రాజ్‌నాథ్, గిరిజన వ్యవహారాల మంత్రి జ్యువెల్ ఓరం కలిసి చర్చలు జరిపినట్టు ఆయన వెల్లడించారు. కాగా తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ మాట్లాడుతూ రాఫెల్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై అనవసరంగా బురద జల్లారని అభిప్రాయపడ్డారు. దేశ రక్షణ విషయాలలో రాజకీయాలు తగవని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతోనైన కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయడం వల్లన తెలంగాణ వ్యతిరేకులకు, తెలంగాణ వాదులకు మధ్య పోరుగా ప్రజల భావించి టీఆర్‌ఎస్ పక్షాన నిలిచారని లక్ష్మణ్ తెలిపారు. రాఫెల్ డీల్‌ను కాంగ్రెస్ కావాలనే ఆలస్య చేసిందని జీవీఎల్ నరసింహరావుఆరోపించారు. కాంగ్రెస్‌తో చేరినందుకు చంద్రబాబుకు తెలంగాణ ప్రజలు గట్టిషాక్ ఇచ్చారని, మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన జోస్యం చెప్పారు.