ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో 13 ఆలయాల స్థాయి పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 14: రాష్ట్రంలో ఆదాయం పెరిగిన ఆలయాలను పరిపాలనా సౌలభ్యం కోసం పర్యవేక్షణాధికారుల పరిధి మార్పు చేశారు. రాష్టవ్య్రాప్తంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ చేపట్టిన ఆదాయ సర్వే నేపథ్యంలో కొత్తగా రాష్ట్రంలో 13 ఆలయాలను కమిషనర్ స్థాయి పరిధిలోకి మార్పుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుల పరిధిలోవుండే రూ.కోటి వార్షికాదాయం ఆదాయం కలిగిన ఆలయాలు వాటి ఆదాయం రూ.కోటి మించడంతో కమిషనర్ స్థాయికి మార్పుచేశారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ ఉన్నతీకరణ అమల్లోకి వచ్చింది. రూ.2 లక్షల నుంచి 5 లక్షల లోపు ఆదాయం కలిగిన ఆయాలు అసిస్టెంట్ కమిషనర్, రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల లోపు ఆదాయం కలిగిన ఆలయాలు డిప్యూటీ కమిషనర్ , రూ.25 లక్షల నుంచి రూ.కోటి లోపు ఆదాయం కలిగిన ఆలయాలు ఆర్జేసీ పరిధిలో ఉన్నాయి.
వరుసగా మూడు సంవత్సరాలు రూ.25 లక్షలు దాటితే రూ.కోటి లోపు ఆదాయం కలిగిన ఆలయాలుగా నిర్ధేశించి కేటగిరి నిర్ణయిస్తారు. అయితే తాజాగా రూ.కోటి దాటిన ‘6ఎ’ కేటగిరి ఆలయాలను కమిషనర్ స్థాయికి ఉన్నతీకరించారు. విశాఖ జిల్లాలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం ఆదాయం రూ.1.19 కోట్లకు పెరగడంతో కమిషనర్ స్థాయికి పెంపొందించారు. అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా ఐదు ఆలయాల ఆదాయం రూ. కోటి దాటింది. పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వరస్వామి ఆలయం, ద్రాక్షారామ శ్రీ భీమేశ్వరస్వామి ఆలయం, అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వరస్వామి ఆలయం, ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, ఐ పోలవరం మండలం మురమళ్లలోని శ్రీ వీరేశ్వరస్వామి ఆలయాల ఆదాయం రూ.కోటి దాటడంతో కమిషనర్ స్థాయికి ఉన్నతీకరించారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీ మద్ధి ఆంజనేయ స్వామి ఆలయం, నిడదవోలు కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయం, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయం, భీమవరం పట్టణంలోని గునుపూడి శ్రీ సోమేశ్వరస్వామి ఆలయం, కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని శ్రీ కొండాలమ్మ అమ్మవారి ఆలయం, జగ్గయ్యపేట మండలం వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీనర్శింహ స్వామి ఆలయం, నూజివీడు మండలం గొల్లపల్లిలోని శ్రీ రఘునందస్వామి ఆలయాలను కమిషనర్ స్థాయికి ఉన్నతీకరించారు. దీంతో ఆర్జేసీ పరిధిలో 6 ఎ గ్రేడ్ ఆలయాలుగా రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండలో శ్రీ కోట దుర్గ అమ్మవారి ఆలయం, శ్రీకాకుళంలోని శ్రీ కూర్మనాధ స్వామి ఆలయం, విజయనగరం జిల్లాలోని ఎస్ కోట మండలం పుణ్యగిరి గ్రామంలోని శ్రీ దార గంగమ్మ, శివాలయం, మక్కువ మండలంలోని సాంబార గ్రామంలోని శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయం, తోటపల్లిలోని శ్రీ వేంకటేశ్వర, కోదండ రామస్వామి ఆలయం, విశాఖ జిల్లాలోని శ్రీ మహాగణపతి ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, సీతమ్మధార శ్రీ షిర్డీ సాయి ఆలయం, విశాఖ అయ్యప్పనగర్‌లోని శ్రీ భూ సమేత విజయ వేంకటేశ్వరస్వామి ఆలయం, విశాఖ జ్ఞానపురం శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి ఆలయం, సంగివలసలోని శ్రీ పోలమాంబ, కోట దుర్గ అమ్మవారి ఆలయం, వెలంపేట శ్రీ దుర్గాలమ్మ ఆలయాలు వున్నాయి. అలాగే తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, కాకినాడలోని శ్రీ పైండా చలమయ్య సత్రం, ట్రస్ట్, కాకినాడ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీ అన్నదాన సమాజం, పెద్దాపురంలోని శ్రీ ఆర్వీబీఎస్ సత్రం, సామర్లకోటలోని శ్రీ కుమార రామ భీమేశ్వరస్వామి ఆలయం, ద్రాక్షారామలోని శ్రీ పీవీ ఆర్ చౌల్ట్రీ, అమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, రాజమహేంద్రవరంలోని శ్రీ చందా సత్రం, శ్రీ నాళం వారి సత్రం, కాండ్రకోట శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం, కాట్రావులపల్లిలోని శ్రీ పీవీ ఎల్ చౌల్ట్రీ, గొందూరు శ్రీ గండిపోచమ్మ అమ్మవారి ఆలయం, ర్యాలీ శ్రీ జగన్మోహినీ కేశవ స్వామి ఆలయం, గోపాలస్వామి ఆలయం, రాజమహేంద్రవరం శ్రీ ఉమా మార్కండేయేశ్వరస్వామి ఆలయం ఆర్జేసీ పరిధిలో వున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో భీమవరంలోని శ్రీ దంతులూరి జగన్నాధరాజు సత్రం, కాళ్ళకుర్రు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, దువ్వ శ్రీ ధనేశ్వరస్వామి ఆలయం, శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీ రత్నాలమ్మ అమ్మవారి ఆలయం, శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం, శ్రీ బండి ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీ మహిషాసుర మర్ధని, శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం, శ్రీ ముత్యాలాంబ అమ్మ ఆలయం, శ్రీ మధన గోపాలస్వామి ఆలయం, శ్రీ రామేశ్వరస్వామి ఆలయం, కృష్ణా జిల్లాలోని శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం, శ్రీ కాళీమాత అమ్మవారి ఆలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీ రంగనాయక స్వామి ఆలయం, శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీ మారెమ్మ అమ్మవారి ఆలయం, శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం (నందిగామ), శ్రీ సత్తెమ్మ అమ్మవారి ఆలయం, శ్రీ రామలింగేశ్వస్వామి ఆలయం (యనమలకుదురు), శ్రీ వెంకమ్మ పేరంటాలు అమ్మవారి ఆలయం, శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం (మచిలీపట్నం), శ్రీ జగన్నాధస్వామి ఆలయం, శ్రీ పెందింటి అమ్మవారి ఆలయం, శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయం (ఓల్డ్ శివాలయం, విజయవాడ), శ్రీ కోటిలింగాల హరిహర మహాక్షేత్రం, శ్రీ భీమేశ్వరస్వామి ఆలయం, శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం ఆర్జేసీ పరిధిలో ఉన్నాయి.