రాష్ట్రీయం

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 14: తిరుమలలో 18న వైకుంఠ ఏకాదశి, 19న ద్వాదశి పర్వదినాలకు విశేషంగా విచ్చేసే భక్తులకు అసౌకర్యం కలుగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుమలలో జరుగుతున్న ఏర్పాట్లను జేఈఓ శ్రీనివాసరాజు, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌జెట్టితో కలసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ విలేఖరులతో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశికి తిరుమలకు ఎక్కువమంది భక్తులు వస్తారని, వీరందరికీ అన్ని వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వైకుంఠ ఏకాదశిరోజున స్వామి దర్శనం కోసం డిసెంబర్ 16వ తేదీ అర్ధరాత్రి 2.30గంటల తరువాత నుండి భక్తులను వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోనికి పంపుతామని తెలిపారు. అక్కడ దాదాపు 28గంటలు భక్తులు వేచి ఉండాల్సి వస్తుందన్నారు. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులు చలికి ఇబ్బందులు పడకుండా ఈసారి మాడవీధుల్లో దాదాపు 40వేల మంది కూర్చునేందుకు వీలుగా ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులను ముందుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్2, వైకుంఠం క్యూకాంప్లెక్స్1లోకి అనుమతిస్తామని, అవి నిండిన తరువాత వరుసగా ఆళ్వార్ ట్యాంక్‌లైన్, నారాయణగిరి ఉద్యానవనాల్లోని షెడ్లలోకి పంపుతామన్నారు. మేదరమిట్ట వద్ద గల ఎన్1 గేటు ద్వారా మాడవీధుల్లో ఏర్పాటు చేసిన షెడ్లలోకి అనుమతిస్తామన్నారు. షెడ్ల వద్ద తాగునీరు, అన్నప్రసాద వితరణ చేస్తామని, మరుగుదొడ్ల వసతి కల్పించామని తెలిపారు.