అన్ని టేకులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో సీరియల్ కిస్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఇమ్రాన్ హష్మీ. ఇమ్రాన్ షహ్మీ సినిమాలో లిప్‌లాక్ సన్నివేశాలు ఉండని సినిమాయే లేదు. ఆయన తాజాగా నటిస్తున్న మరో చిత్రం అజహర్. ప్రముఖ టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో అజహర్ రెండో భార్య సంగీతా బిజిలానీ పాత్రలో బాలీవుడ్ భామ నర్గీస్‌పక్రి నటిస్తోంది. ఈ సినిమాలో ఓ పాటలో వీరిద్దరి మధ్య ఘాటు లిప్‌లాక్ సన్నివేశం ఉందట. దాన్ని చిత్రీకరించే సమయంలో ఇమ్రాన్ చాలా టేకులు తీసుకున్నాడని చెబుతోంది నర్గీస్. దీనిపై స్పందిస్తూ ఆ సన్నివేశం కోసం అన్నిసార్లు టేకులు తీసుకోవడం ఆశ్చర్యమేసింది. ఒకానొక సమయంలో చిరాకు కూడా తెప్పించిందని అంటూనే కావాలనే ఈ సన్నివేశాలకోసం ఎక్కువ టేకులు తీసుకున్నట్టు అర్ధమవుతోందని చెబుతోంది. మరి దీన్నిబట్టి ఇమ్రాన్ ఎంత రొమాంటిక్కో అర్ధం చేసుకోవచ్చు.

చిత్రం నర్గీస్‌పక్రి