రాష్ట్రీయం

వైభవంగా భద్రాద్రి రామయ్య తెప్పోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, డిసెంబర్ 17: వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాద్రిలో రామయ్య స్వామివారి తెప్పోత్సవం సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా సాగింది. స్వామివారికి మధ్యాహ్నం 3 గంటలకు ఆలయంలో దర్బారుసేవ నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు రామాలయం నుంచి భారీ ఊరేగింపుగా సీతారామచంద్రులు గోదావరి నదీ తీరానికి బయలుదేరారు. భక్తుల సంప్రదాయ నృత్యాలు, కోలాటాలు, జయజయ ధ్వానాలతో ఉత్సవమూర్తులను ఊరేగింపుగా హంసవాహనంపై ఉంచి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ వేడుకలో సీతారామచంద్రస్వామికి భక్తులు నీరాజనం పలికారు. హంసవాహనంపై ఉన్న స్వామివారిని ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, ఎమ్మెల్యే పొదెం వీరయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు రాగా ఉత్సవం కడు వైభవంగా జరిగింది. వేద పాఠశాల విద్యార్థులు వేదాలు పఠిస్తూ రాముడిని కొలిచారు. కాగా తెప్పోత్సవ క్రతువులో నదిలో స్వామి విహారాన్ని వర్షం దృష్ట్యా అధికారులు నిలిపివేశారు. తుఫాను ప్రభావంతో ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో హంసవాహనంపై స్వామిని కూర్చుండబెట్టి పూజాది కార్యక్రమాలు జరిపించారు. జలవిహారాన్ని మాత్రం కొనసాగించలేకపోయారు. వర్షం వల్ల ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు.