అనంతపురం

సూరికి సన్నిహితమై.. చివరకు హంతకుడై..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 18: రాష్ట్రంలో సంచలనం రేపిన మద్దలచెరువు సూరి అలియాస్ గంగుల సూర్యనారాయణరెడ్డి హత్య కేసులో జీవితఖైదు పడిన భానుకిరణ్‌కు అనంతపురంతో విడదీయలేని అనుబంధం ఉంది. భాను జీవితం విద్యార్థి దశలోనే పెడతోవ పట్టింది. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన భానుకిరణ్ కుటుంబం కొన్ని దశాబ్దాల క్రితమే అనంతపురం వలస వచ్చి అరవిందనగర్, సాయినగర్‌లో నివాసం ఉండేది. అప్పట్లో అతని తల్లి ఉపాధ్యాయురాలిగా పని చేస్తుండేది. 1990లో అనంతపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో భానుకిరణ్ ఇంటర్ చదువుతుండేవాడు. ఇతనితో పాటు ధర్మవరం మండలం సుబ్బరాయపేటకు చెందిన వాసుదేవరెడ్డి సహ విద్యార్థిగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో వాసుదేవరెడ్డితో పాటు సూరి ఇంటికి వెళ్లి వస్తున్న క్రమంలో సూరితో పరిచయం ఏర్పడింది. దీంతో తరచూ వీరిద్దరూ సూరిని కలిసేందుకు వెళ్లేవాళ్లు. కారుబాంబు కేసులో సూరి జైలుకు వెళ్లేటప్పుడికే భానుకిరణ్ బాగా దగ్గరయ్యాడు. సూరి జైలులో ఉన్న సమయంలో బయట ఆయనకు సంబంధించి కోర్టు వ్యవహారాలు భానుకిరణ్ చూసుకునేవాడు. సూరి జైలునుంచి విడుదల కాగానే అత్యంత సన్నిహితుడిగా మారాడు. ఫలితంగా సూరికి చెందిన అన్ని ఆర్థిక లావాదేవీలు భాను చూసుకునేవాడు. అయితే సూరికి తెలియకుండా భాను పలు సెటిల్‌మెంట్లు చేసేవాడన్న ఆరోపణలున్నాయి. అలా వచ్చిన సొమ్మంతా తనకు నమ్మకస్తులైన స్నేహితులను బినామీలుగా చేర్చి డబ్బు దాచాడన్న అనుమానాలు తలెత్తాయి. భానుకిరణ్ వ్యవహారంపై సూరికి మంగళికృష్ణ, అశోక్‌రెడ్డి, సుధాకర్ ఫిర్యాదు చేశారు. అంతకుముందు హంద్రీనీవా కాంట్రాక్టు దక్కించుకునే ప్రయత్నంలో రూ.178 కోట్ల పనులను సబ్ కాంట్రాక్టుగా కేవీఎన్ రెడ్డి అనే కాంట్రాక్టర్‌కు ఇప్పించాడు. అలాగే అన్నపూర్ణ ప్యాకేజీ విషయంలోనూ సూరీకి తెలియకుండా దందా సాగించాడు. 2011లో హైదరాబాద్‌లో సూరిని హత్య చేసిన అనంతరం పట్టుబడిన తర్వాత సీఐడీ అధికారులు విచారణలో భానుకిరణ్ స్వయంగా ఈ విషయాలను అంగీకరించడం గమనార్హం.