కడప

వజ్రపు చీర అలంకరణలో దర్శనమిచ్చిన వాసవీ మాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, డిసెంబర్ 18: ప్రొద్దుటూరు పట్టణ పరిధిలోని మెయిన్ బజార్‌లో ఉన్న శ్రీ మత్కన్యకా పరమేశ్వరీదేవి ఆలయం(అమ్మవారిశాల)లో మంగళవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వాసవిమాత వజ్రపు చీర అలంకరణతో భక్తాదులకు దర్శనమిచ్చింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అమ్మవారిశాలలో వాసవీమాతకు ఆర్యవైశ్య సభ, ఆలయ పండితుల ఆద్వర్యంలో విశేష అభిషేకాలు, పూజాది కార్యక్రమాలు, ప్రత్యేక పుష్పాలంకరణలు నిర్వహించడంతో పాటు విశేషంగా వజ్రపు చీర అలంకరణ నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్యదినం సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

రాజంపేట శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీదేవికి బంగారు కిరీటం
రాజంపేట, డిసెంబర్ 18:రాజంపేట శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీదేవ అమ్మవారికి స్థానిక ఆర్యవైశ్య సంఘం రూ.25లక్షల వ్యయంతో బంగారు కిరీటాన్ని తయారుచేయించారు. ఈ బంగారు కిరీటాన్ని ఆర్యవైశ్య మహిళలు, పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు ఊరేగింపుగా తీసుకొచ్చి మంగళవారం అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి సంబంధించిన ప్రత్యేక రోజుల్లో ఈ బంగారు కిరీటాన్ని అమ్మవారికి అలంకరిస్తారు. ఇప్పటికే అమ్మవారికి బంగారు చీరతో పాటు వెండి రథం ఇతరత్రా బంగారు, వజ్రాలతో కూడిన పలు ఆభరణాలు ఆర్యవైశ్య సంఘం చేయించి అమ్మవారికి సమర్పించి ఉంది. ఈ బంగారు కిరీటాన్ని అమ్మవారికి సమర్పించే కార్యక్రమాన్ని ఆధ్యాత్మికత ఉట్టిపడే రీతిలో ఆర్యవైశ్య సంఘం నిర్వహించింది.

కొలిక్కిరాని గోడౌన్ సమస్య..
* పోలీసుల ఆధ్వర్యంలో రైతుల ధాన్యం పంపిణీ * రైతుల్లో తొలగని ఆందోళన
జమ్మలమడుగు, డిసెంబర్ 18: జమ్మలమడుగు-తాడిపత్రి ప్రధాన రహదారిలోని గూగూడు కుళ్లాయిస్వామి ధాన్యంనిల్వ గోడౌన్ సమస్య ఇంకా కొలిక్కిరాలేదు. గోడౌన్‌లో రైతులు నిల్వచేసుకున్న వివిధ రకాల ధాన్యాలు ఎక్కడికి తరలిపోలేదని, నిల్వ చేసుకున్న రైతులకు ఎవరి ధాన్యాన్ని వారికి అందజేస్తామంటూ పోలీసుల ఆధ్వర్యంలో ధాన్యం పంపిణీని మంగళవారం ప్రారంభించారు. అయితే కెనరా, ఎస్‌బిఐ బ్యాంకుల సిబ్బంది గోడౌన్ వద్దకు చేరుకుని ధాన్యంపై తమ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు, తమ ప్రమేయం లేకుండా రైతులకు ధాన్యం ఇవ్వరాదని మంగళవారం మధ్యాహ్నం అడ్డగించడంతో గోడౌన్ పరిసరాల్లో తిరిగి ఆందోళన వాతావరణం నెలకొంది. కెనరా బ్యాంక్ ఆర్‌వో చంద్రశేఖర్ బ్యాంకు రుణాల విషయాన్ని ప్రస్తావించగా రైతులు వ్యక్తిగతంగా తీసుకున్న రుణాలు ఎవరైనా ఉంటే పరిశీలించి వారి ధాన్యం తరలింపును అడ్డుకోవాలి కాని ఇలా రైతులందరి ధాన్యం తీసుకెళ్లడాన్ని నిలుపవద్దని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ప్రధాన రహదారిపై వాహనాలు అడ్డగించి, బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసుశాఖ ధాన్యం నిల్వ చేసుకున్న రైతులకు కూపన్లుఇచ్చి వరుసక్రమంలో ధాన్యం తీసుకెళ్లాల్సిందిగా సూచించడంతో సాయంత్రం వేళ నుండి గోడౌన్ నుండి ధాన్యం పంపిణీ తిరిగి ప్రారంభించారు. జమ్మలమడుగు రూరల్ సీఐ ఉమామహేశ్వరరెడ్డి, మైలవరం, తలమంచిపట్నం ఎస్సైలు సునీల్‌కుమార్‌రెడ్డి, రాఘవేంద్రరెడ్డి పోలీసు సిబ్బందితో గోడౌన్‌వద్ద బందోబస్తు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు.

ఎంపీగా రాహుల్‌ను అనర్హుడుగా ప్రకటించాలి
* బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనాథరెడ్డి
కడప సిటీ,డిసెంబర్ 18: రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి నిరాధారమైన అసంబద్ధమైన ఆరోపణలతో దేశప్రజలను తప్పుదోవ పట్టించిన రాహుల్‌గాందీని ఎంపీగా అనర్హులుగా ప్రకటించాలని మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనాథరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై బురదచల్లి రాజకీయ లబ్దిపొందడానికే జాతీయ భద్రతకు సంబంధించిన రాఫెల్ డీల్‌ను రాహుల్ రచ్చకీడ్చి దేశ ప్రతిష్టను విదేశాల్లో దిగజార్చే ప్రయత్నం చేయడం చాలా దారుణమైన విషయమన్నారు. రాఫెల్ డీల్ విషయంలో మోదీ సర్కార్ పారదర్శకంగా పక్షపాత రహితంగా వ్యవహరించినందున సందేహించాల్సిన కారణాలు ఏమీ లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపధ్యంలో రాజకీయ స్వప్రయోజనాల కోసమే రాహుల్ అసత్య ఆరోపణలు చేసినట్లు స్పష్టవౌతోందన్నారు. ఈవిషయంలో ఒక బాధ్యతగల ఎంపీగా, కాంగ్రెస్ అధ్యక్షునిగా ఆయన వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. సరైన ఆధారాలు లేకుండానే దేశ భధ్రతకు సంబంధించిన అంశాన్ని బాధ్యతారహితంగా వివాదాస్పదం చేసిన రాహుల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్టప్రతిని బీజేపీ కోరుతోందన్నారు. ఈమేరకు బీజేపీ శ్రేణులు డిఆర్వో రఘునాధ్‌కు వినతిపత్రం సమర్పించారు.

జిల్లాలో పెరిగిన చలి
* పడిపోయిన ఉష్ణోగ్రతలు
కడప అర్బన్,డిసెంబర్ 18: తుఫాన్ ప్రభావంతో జిల్లాలో చలి గాలుల తీవ్రత ప్రభావం ఎక్కువైంది. రాష్ట్రంలో గత రెండురోజుల నుంచి ‘పెథాయ్’ తుఫాన్ ప్రభావం నెలకొంది. దీంతో ఒక్కసారిగా గరిష్టంగా ఉన్న ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయాయి. కడప జిల్లా గత నాలుగురోజుల ఉష్ణోగ్రతలు పరిశీలించినట్లయితే శనివారం 20డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా, 32 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నెలకొంది. ఆదివారం 19డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 30డిగ్రీలు నమోదయ్యాయి. సోమవారం మరింత ఉష్ణోగ్రతల ప్రభావం ఏర్పడింది. 17డిగ్రీల కనిష్టస్థాయి ఉష్ణోగ్రతలకు పడిపోయింది. గరిష్టంగా 25డిగ్రీలు ఉండగా మంగళవారం కూడా అదేరీతిలో అనగా 17డిగ్రీలు కనిష్టస్థాయి ఉష్ణోగ్రతలు నమోదు చేసుకుని 32డిగ్రీలతో సరిపెట్టుకుంది. దీంతో చలి ప్రభావం మరింత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తక్కువస్థాయి పడిపోవడంతోపాటు దీనికితోడు పెథాయ్ తుఫాన్‌ప్రభావం రాష్ట్రంలో నెలకొనడంతో చలిగాలుల వేగం తీవ్రత పెరిగింది. ఈక్రమంలో పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువస్థాయికి పడిపోయి చలితీవ్రత అధికమైంది. మంగళవారం ముక్కోటి ఏకాదశి కావడంతోభక్తులు చల్లనీటి స్నానం ఆచరించి దేవాలయాలకు వెళ్లడం కాసింత ఇబ్బందికరంగా ఉన్నా మొక్కులు చెల్లించుకోవడానికి తప్పని పరిస్థితిలో చలికితోడు చల్లని నీరు తోడైంది. ఉత్తర దిక్కునుంచి వచ్చే తీవ్ర చల్లటి గాలుల వల్ల రాత్రిసమయంలో చలి తీవ్రత పెరిగే ప్రభావం ఉంది. ఈనెల, జనవరిలో మరింత తీవ్రంగా ఉన్నట్లు వాతావరణ శాస్తవ్రేత్తలు తెలుపుతున్నారు. తుఫాన్ అల్పపీడనంగా ఏర్పడి బలహీనపడినప్పటికీ రాయలసీమ వరకు ఈ ఉపరితల ద్రోణి ప్రభావం మాత్రం ఉంది. దీంతో పగటిపూట చలిగాలుల తాకిడి, రాత్రి పూట చలితీవ్రత పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో చలిమంటలు వేసుకుని చలితీవ్రత నుంచి బయటపడుతుండగా పట్టణ ప్రాంతాల్లో వీలున్న చోట్ల కూడా చలిమంటలు వేసుకుంటున్నారు. ఈ చలి తీవ్రత నుంచి ఉలన్‌కోట్లు, స్పెటర్లు, మంకీక్యాప్‌లు, మాస్క్‌లు ధరించి రక్షణ పొందాలని ప్రజలకు వైద్యులు సూచిస్తున్నారు. అలాగే చిన్నపిల్లలను ఉదయం, సాయంత్రం బయటకు తీసుకురావద్దని, ఆస్తమా, ఉబ్బసం ఉన్న వ్యక్తులు ఉదయం పూట వాకింగ్ పూర్తిగా మానుకోవాలని,సాయంత్రం 4గంటల నుంచి వాకింగ్‌తోపాటు ఇంటిలో మెడిటేషన్, యోగాసనాలు, వ్యాయామాలు చేసుకోవాలని వైద్యులు సూచించారు.

ఎంపీగా రాహుల్‌ను అనర్హుడుగా ప్రకటించాలి

కడప సిటీ,డిసెంబర్ 18: రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి నిరాధారమైన అసంబద్ధమైన ఆరోపణలతో దేశప్రజలను తప్పుదోవ పట్టించిన రాహుల్‌గాందీని ఎంపీగా అనర్హులుగా ప్రకటించాలని మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనాథరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై బురదచల్లి రాజకీయ లబ్దిపొందడానికే జాతీయ భద్రతకు సంబంధించిన రాఫెల్ డీల్‌ను రాహుల్ రచ్చకీడ్చి దేశ ప్రతిష్టను విదేశాల్లో దిగజార్చే ప్రయత్నం చేయడం చాలా దారుణమైన విషయమన్నారు. రాఫెల్ డీల్ విషయంలో మోదీ సర్కార్ పారదర్శకంగా పక్షపాత రహితంగా వ్యవహరించినందున సందేహించాల్సిన కారణాలు ఏమీ లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపధ్యంలో రాజకీయ స్వప్రయోజనాల కోసమే రాహుల్ అసత్య ఆరోపణలు చేసినట్లు స్పష్టవౌతోందన్నారు. ఈవిషయంలో ఒక బాధ్యతగల ఎంపీగా, కాంగ్రెస్ అధ్యక్షునిగా ఆయన వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. సరైన ఆధారాలు లేకుండానే దేశ భధ్రతకు సంబంధించిన అంశాన్ని బాధ్యతారహితంగా వివాదాస్పదం చేసిన రాహుల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్టప్రతిని బీజేపీ కోరుతోందన్నారు. ఈమేరకు బీజేపీ శ్రేణులు డిఆర్వో రఘునాధ్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్టక్రార్యవర్గసభ్యులు కెవి చలమారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెసల సాంబశివారెడ్డి, నగర అధ్యక్షుడు ఎరికలప్ప, ధార్మికసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.శ్రీనివాసులురెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గజ్జల రామకృష్ణారెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి జి.లక్ష్మణరావు, శివకృష్ణ, రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.