అదిలాబాద్

అక్రమ కలప తరలిస్తున్న ఆటో పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్చోడ,డిసెంబర్ 18: అక్రమంగా కలపను తీసుకవెళ్తున్న ఆటోను మంగళవారం తెల్లవారు జామున అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. పట్టుకున్న కలప విలువ సుమారు రూ.50వేల వరకు ఉంటుందని అటవీక్షేత్రాధికారి వాహబ్ ఆహ్మాద్ తెలిపారు. గుండాల నుండి సిరికొండ వైపు స్మగ్లర్లు ఆటోలో కలప రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తమై నిఘా పెట్టారు. ఇందులో భాగంగానే అనుమానస్పదంగా వస్తున్న ఆటోను నిలిపి తనిఖీ చేయగా అందులో పది కలప దుంగలు బయటపడ్డాయి. స్మగ్లర్లు ఆటోను వదిలి పారిపోవడంతో కలపతో పాటు ఆటోను స్వాదీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు వాహబ్ ఆహ్మాద్ తెలిపారు. ఈ దాడిలో అటవీ శాఖ సిబ్బంది ముక్తార్ ఆహ్మాద్, రాథోడ్ సందీప్, జంగుబాబు తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే
జోగు రామన్నకు ఘన సత్కారం
ఆదిలాబాద్ టౌన్,డిసెంబర్ 18: ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాల్గవ సారి గెలుపొందిన జోగురామన్నను మంగళవారం నేతకాని మహార్ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం నేతకాని మహార్ కులస్తులను అన్ని రకాలుగా అభివృద్ది చేసేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సిఎం కెసిఆర్ అనేక సంక్షేమ, అభివృద్ది పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతకాని మహార్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాడి నర్సయ్య, అధికార ప్రతినిది జాడి రవిందర్, కార్యదర్శి పోశన్న, జిల్లా కార్యదర్శి దుర్గం వెంటకపతి, రాజు, రత్నం, బానయ్య పాల్గొన్నారు.