కృష్ణ

ఓటుతో బాబు ప్రభుత్వానికి పాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మాతో ఆకలి కేకలు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓటుతో పాతర వేస్తామని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు హెచ్చరించారు. అమ్మ మనస్సు చేసుకుని పుస్తులు తాకట్టు పెట్టి విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెడుతున్న తమ పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను వారు తూర్పారబట్టారు. తమ ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు నేడు కాంట్రాక్టర్లకు అండగా నిలుస్తూ తమ పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. స్వచ్ఛంద సంస్థల పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ పరం చేసి తమను రోడ్డుకు ఈడ్చే ప్రయత్నాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలన్నారు. లేకుంటే తమ ఆకలి కేకలతో ప్రభుత్వాన్ని కూలదోస్తామని బుధవారం జరిగిన కలెక్టరేట్ ముట్టడిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా నలుమూలల నుండి తరలి వచ్చిన వందలాది మంది కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఉద్యమ నాయకులు, కార్మిక సంఘం ప్రతినిధులు వాడివేడి ప్రసంగాలతో ఆందోళనను పతాక స్థాయికి తీసుకు వెళ్లారు. ధర్నా చేస్తున్న కార్మికులంతా ఒక్కసారిగా కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని నిలువరించారు. ఆర్‌పేట, ఇనగుదురు, చిలకలపూడి, బందరు తాలుకా సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు వాసవి, నబీ, దుర్గాప్రసాద్, రవికుమార్ నేతృత్వంలో పెద్ద ఎత్తున మహిళా కానిస్టేబుళ్లు మధ్యాహ్న భోజన పథకం కార్మికులను కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సమయంలో కార్మికులు, పోలీసుల మధ్య వాగ్వివాదం, తోపులాటలు చోటు చేసుకున్నాయి. కొంత మంది మహిళా కానిస్టేబుళ్లు కార్మికులను పోలీసు వాహనాల్లోకి ఎక్కించారు. దీంతో మరింత ఆగ్రహించిన కార్మికులు ఉద్యమకారులను ఎక్కించిన పోలీసు వాహనాలను అడుగడుగునా అడ్డగించారు. రోప్ పార్టీ సాయంతో పోలీసు వాహనంలో ఉన్న ఉద్యమకారులను చిలకలపూడి పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్నట్టు తరలిస్తూనే కలెక్టరేట్‌కు దూరంగా ఉన్న బందరు తాలుకా పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో తొలుత చిలకలపూడి పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేసిన కార్మికులు అనంతరం పక్కనే ఉన్న జిల్లా పోలీసు కార్యాలయంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. దీన్ని కూడా పోలీసులు అడ్డగించి ఆందోళనకారులను అరెస్టు చేసి తాలుకా, ఇనగుదురు, గూడూరు పోలీసు స్టేషన్‌లకు తరలించారు. అక్రమ అరెస్టులను కార్మికులు తీవ్రంగా ఖండించారు. కలెక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యాలయాల ముట్టడి రణరంగంగా మారింది. అరెస్టు చేసిన ఆందోళనకారులను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ ఆందోళనకు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి పార్వతి, ఎన్‌సిహెచ్ సుప్రజ, ఆశ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎ కమల, సీఐటీయు తూర్పు కృష్ణా అధ్యక్ష, కార్యదర్శులు చౌటపల్లి రవి, వై నరసింహరావు, బందరు డివిజన్ కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం, సిహెచ్ జయరావు తదితరులు నాయకత్వం వహించారు.