తెలంగాణ

కొత్త పథకాలకే కోడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 4: పంచాయతీ ఎన్నికల కోడ్ గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఇతర మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తించదని రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే అమలులో ఉన్న పథకాలకు కోడ్ వర్తించదని స్పష్టం చేశారు. అయితే కొత్త పథకాలను ప్రకటించడం కోడ్ ఉల్లంఘన కిందకి వస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సాధారణ, వ్యయ పరిశీలకులతో శుక్రవారం నాడిక్కడ రాష్ట్ర ఎన్నికల అధికారి సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణతో పాటు ఎన్నికల కోడ్‌పై పరిశీలకులకు అవగాహనపై దిశానిర్దేశం చేశారు. పరిశీలకులకు ఈ సందర్భంగా జిల్లాలను కేటాయించారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి పరిమితులు విధించామని, పరిమితికి మించి ఖర్చు చేస్తే కఠిన చర్యలు తప్పవని నాగిరెడ్డి హెచ్చరించారు.గత ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ఖర్చులను సమర్పించకపోయినా ఈ ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటిస్తామన్నారు. బలవంతంగా కానీ, బెదిరించికానీ ఎన్నికను ఏకగ్రీవం చేసినా చర్యలు ఉంటాయన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. చర్యల విషయంలో పరిశీలకులకు పూర్థి స్వేచ్ఛ ఉందని, వారిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. అవసరమైతే రీ పోలింగ్‌కు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో పోలీసు బలగాలను మోహరింపు ఉంటుందని, అవసరమైతే అదనంగా కూడా పంపిస్తామన్నారు.
ఎన్నికల నిర్వహణలో పరిశీలకులు లెవనెత్తిన అనుమానాలను నాగిరెడ్డి నివృతి చేశారు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు, రేషన్ షాపుల డీలర్లు కూడా ఎన్నికల్లో పోటీకి అర్హులేనని ఆయన స్పష్టం చేశారు. పోలీంగ్, కౌటింగ్‌లపై పరిశీలకులకు అవగాహన కల్పించారు.