రంగారెడ్డి

మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలకొండపల్లి: మండలంలోని 32 గ్రామ పంచాయితీలకు నేటి నుంచి మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందని ఎంపిడీవో శ్రీనివాసా చారి తెలిపారు. 32 గ్రామ పంచాయితీలలోని 32033 ఓటర్లకు పురుషులు 16546, మహిళలు 15484 మంది తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నట్లు తెలిపారు. 32 గ్రామ పంచాయితీలలోని 272 వార్డులో పోలింగ్ నిర్వహించునున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 11 నుంచి 13వరకు నామినేషన్ల స్వీకరణ, 14న నామినేషన్ల పరిశీలన, 15న ఆర్‌డీవోకు అభ్యంతరాలపై అప్పీలు, 16న ఆర్‌డీవోకు చేసుకున్న అప్పీలపై పరిష్కారం, 17న నామినేషన్ల ఉపసంహరణ, అదేరోజు అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, 25న పోలింగ్ ఉదయం 7గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంటకు ముగుస్తుందని, మధ్యాహ్నం 2గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమై, తదుపరి విజయం సాధించిన అభ్యర్థులను అధికారకంగా ప్రకటిస్తారని ఎంపీడీవో శ్రీనివాసా చారి సూచించారు.
ఎన్నికలకు సర్వం సిద్ధం
ఆమనగల్లు: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల పోరు రోజురోజుకూ వేడెక్కుతుంది. ఏకగ్రీవానికి అధికార పార్టీ నేతలు ప్రయత్నాలను మమ్మరం చేశారు. ఆమనగల్లు మండలంలోని 13 గ్రామ పంచాయతీలకు, 112 వార్డు స్థానాలకు ఈనెల 25న ఎన్నికలు నిర్వహించునట్టు ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. నూతనంగా ఏర్పడిన గిరిజన తండాలను వేలంపాటలు పాడి దక్కించుకొని ఏకగ్రీవం చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలను అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి.
రెండు పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకొని ప్రజలు తమ వైపే ఉన్నారనే భావన కలిపించేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు చేసుకుంటున్నారు. మండలంలోని రెండో విడతలో ఈనెల 25న ఎన్నికలు జరుగుతాయి. ఈనెల 11 నుంచి 13 వరకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 14న నామినేషన్లు పరిశీలిస్తారు. 15న నామినేషన్ వివరాలపై అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓకు దరఖాస్తు చేసుకోవచ్చు. 16న నామినేషన్ల పరిశీలన, 17న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అనంతరం సాయంత్రం పోటీలో ఉండే అభ్యర్థుల వివరాలు వారికి కేటాయించిన గుర్తుల వివరాలు వెల్లడిస్తారు. ఈనెల 25న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ పూర్తి చేసి విజేతలను ప్రకటిస్తామని ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి, ఎంపీడీఓ వెంకట్రాములు తెలిపారు.