క్రీడాభూమి

మూడో రౌండ్‌కు నొవాక్ జొకోవిచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 17: ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియా గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో మూ డో రౌండ్ చేరాడు. రెండో రౌం డ్‌లో అతను ‘జెయింట్ కిల్లర్’ జో విల్‌ఫ్రైడ్ సొంగాను 6-3, 7-5, 6-4 తేడాతో ఓడించి, ముందంజ వేశాడు. మిలోస్ రోనిక్ చేతిలో స్టానిస్లాస్ వావ్రిన్కా 7-6, 6-7, 6-7 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. జపాన్ క్రీడాకారుడు కెయ్ నిషికొరి 6-3, 7-6, 6-7, 7-5 స్కోరుతో ఇవో కర్లొవిచ్‌పై విజయం సాధించాడు. టైటిల్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉ న్న ఆటగాళ్ల లో ఒకడైన జర్మనీ యు వ సంచలనం అలెగ్జాండర్ జ్వెరెవ్ 7-6, 6-4, 5-7, 7-6 ఆధిక్యంతో జెరె మీ చార్డీపై గెలుపొందాడు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో బరిలో కి దిగిన అలెక్సీ పొ పిరిన్‌తో తలపడాల్సిన డామినిక్ థి యేమ్ మొదటి రెండు సెట్లను 7-5, 6-4 తేడాతో గెల్చుకొని, మూడో సెట్ లో 2-0 ఆధిక్యాన్ని సంపాదించాడు. ఈ దశలో కండరాలు పట్టేయడంతో రిటై ర్ అయ్యాడు. అదృష్టం కలిసొచ్చిన పొపిరిన్ మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. డేవిడ్ గొఫిన్ 5-7, 7-5, 6-2, 6-4 తేడాతో మారియస్ లొపిల్‌ను ఓడించాడు.