ఆంధ్రప్రదేశ్‌

ప్రపంచ ఆర్థిక సదస్సుకు లోకేష్ నేతృత్వంలో బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), జనవరి 21: ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతినిధి బృందం బయలు దేరి వెళ్లింది. ఏపీ ఐటీ, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వం వహిస్తున్న ఈ బృందం సోమవారం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయలు దేరి వెళ్లింది. ఈనెల 22 నుండి 24 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గోనున్న ఈ బృందానికి నేతృత్యం వహిస్తున్న లోకేష్ వరల్డ్ ఎకనామిక్ ఫోర్ కాంగ్రెస్ సెంటర్లో కీలక ప్రసంగం చేయనున్నారు. సన్‌రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని పెట్టుబడులు తీసుకోచ్చే లక్ష్యంతో వెళ్తున బృందం ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులతో భేటీ కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత సంపన్న, శక్తివంతమైన దేశాలకు చెందిన ప్రభుత్వ నేతలు, పెట్టుబడిదారులు, వాణిజ్య వేత్తలు, ప్రఖ్యాత కంపెనీల నిర్వాహకులు, ఆర్థిక వేత్తలు పరస్పరం ఆలోచనలు పంచుకునేందుకే ఈ ప్రపంచ ఆర్థిక వేదికను ఏర్పాటు చేశారు. తమ దేశాలు, ప్రాంతాల అభివృద్ధి కోసం హాజరైన ప్రతినిధులు ఈ వేదికపై చర్చించనున్నారు. పెట్టుబడులు, టెక్నాలజీ, భవిష్యత్ వాణిజ్యం, ప్రజల అవసరాలు వంటి వాటిపై కీలక ప్రసంగాలు చేస్తారు. పారిశ్రామికాభివృద్ధి, ఆర్థిక ప్రగతి, పర్యావరణ పరిరక్షణ, అంతర్జాతీయ సంబంధాలు బలపడేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక వేదికగా ఉపయోగపడనుంది. వివిధ దేశాల నుండి వందకు పైగా ప్రభుత్వ ప్రతినిధులు, వెయ్యికి పైగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులు దావోస్ సదస్సుకు హాజరు కానున్నారు.
ఏపీలో పెట్టుబడుల కోసం చొరవ
ఏపీ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని ఏపీ ప్రత్యేక ప్రతినిధి బృందం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డెలాయిట్, ప్రోక్టర్ అండ్ గేంబల్, విప్రో, పెగాసిస్టమ్స్, ఆర్సెలార్ మిట్టల్, నెస్లే, ఏటీ అండ్ టీ, ఇనె్వస్కో కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో ఉన్న అనువైన పరిస్థితులను వివరించి, వారిని ఒప్పించి రప్పించేందుకు ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రంగా కృషి చేయనున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటి స్థానంలో నిలిచిన ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలు, ఇస్తున్న రాయితీలు ఆయా కంపెనీల ప్రతినిధులకు వివరిస్తారు. రోజుకు దాదాపు 15 గంటలకు పైగా జరిగే వివిధ సమావేశాల్లో కంపెనీల ప్రతినిధులతో విరామం లేకుండా చర్చలు కొనసాగించనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక కాంగ్రెస్ సెంటర్లో కీలక అంశాలపై మంత్రి లోకేష్ ప్రసంగించనున్నారు. 23వ తేదిన ఎజైల్ గవర్నెన్స్, డిజిటల్ గవర్నెన్స్, ఇండియా 4.0 అంశాలపై లోకేష్ ప్రసంగించనున్నారు. 24వ తేదిన సస్టైనబుల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అంశాలపై మాట్లాడనున్నారు.
లోకేష్‌కు బాధ్యతలు అప్పజెప్పిన సీఎం చంద్రబాబు
ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లాల్సి ఉంటే, గణతంత్ర వేడుకలు, ఇతర సమావేవాల నేపథ్యంలో తన పర్యటనను రద్దు చేసుకుని ఆ బాధ్యతలను మంత్రి నారా లోకేష్‌కు అప్పగించారు. ఈపర్యటనలో లోకేష్‌తో పాటు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ రంగం ప్రభుత్వ సలహాదారుడు టీ విజయకుమార్, ఇంధనం, వౌలిక, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఏపీఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిషోర్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆరోక్యరాజ్, ఏపీఐఐసీ ఎండీ ఆహ్మద్‌బాబు, సమాచారశాఖ కార్యదర్శి బి రామాంజనేయులు, వైద్యశాఖ సలహాదారుడు డాక్టర్ జితేందర్ శర్మ, ఐటీ ఓస్డీ కిరణ్ గుత్తా, ఐటీ జీఎం శ్రీనివాస్‌లు కూడా దావోస్ పయనమయ్యారు.