గుంటూరు

హృదయ తంత్రులను మీటిన శ్రీనివాస్ వీణావిన్యాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), జనవరి 23: స్థానిక లక్ష్మీపురం త్యాగయ్య కళావేదికపై జరుగుతున్న నాదయోగి ఆరాధన సంగీత మహోత్సవాల్లో బుధవారం రాత్రి భాగ్యనగరం నుంచి విచ్చేసిన ప్రముఖ వైణిక విద్వాంసుడు శ్రీనివాస్ కచేరి ఆద్యంతం శ్రోతలను సమ్మోహనం గావించింది. ఈ వైణిక చక్రవర్తి దేశ విదేశాల్లో ఎన్నో కచేరిలు చేసి, భారతీయ సంగీత వాణిని తన వీణావాదనం ద్వారా వినిపించి ప్రశంసలు అందుకున్నారు. శ్రీనివాస్ తన వీణపై త్యాగయ్య కృతి కీర్తనల సాహిత్యాన్ని పలికించి సంగీతాభిమానుల హృదయ తంత్రులను సుతారంగా మీటారు. స్వరకల్పన, గమకాలు పలికించడంలో తనదైన ప్రతిభను కనబర్చారు. చివరగా వేదాన్ని కూడా తన వీణపై పలికించి, వినిపించి శ్రోతలను కట్టిపడేశారు. శ్రీనివాస్ వీణా కచేరికి కె సద్గురుచరణ్ మృదంగం, ఎం హరిబాబు ఘటంపై వాద్యసహకారం అందించి ప్రశంసలు పొందారు. ఆడిటర్ రామరాజు శ్రీనివాస్ దంపతులు ఈ కార్యక్రమానికి సహకరించారు. త్యాగరాజ సాంస్కృతిక సంఘ కార్యదర్శి నేతి విశే్వశ్వరరావు, సంయుక్త కార్యదర్శి గిరిజా శంకర్, ఉపాధ్యక్షుడు బి సూర్యనారాయణమూర్తి, కోశాధికారి ఎన్‌వి సాంబశివరావు తదితరులు కళాకారులను సత్కరించారు.

దుర్గిలో రసవత్తరంగా బండ లాగుడు ఎడ్ల పోటీలు
దుర్గి, జనవరి 23: శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తిరుణాళ్ళని పురష్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో జరుగుతున్న ఎడ్ల పోటీలలో బుధవారం 6 పళ్ళ విభాగంలో హోరా హోరీగా 6 జతలు పాల్గొన్నాయి. ఈ విభాగంలో మొదటి బహుమతి గణేశ్ రత్తయ్య ఇనిమొట్ల, రాజుపాలెం మండలం, కొండబోలు ఫణి కుమార్ వల్లభరావు వారి పాలెం, సంయుక్త జత 3750 అడుగులు, రెండవ బహుమతి కానాల అంజిరెడ్డి పెదగార్లపాడు, దాచేపల్లి మండలం, దప్పిల అంజిరెడ్డి శ్రీనివాసపురం కాలనీ, పిడుగురాళ్ళ మండలం సంయుక్త జత 3666 అడుగులు, మూడవ బహుమతి మేకల అంజిరెడ్డి గణపవరం, రాజుపాలెం మండలం, జత 3295 అడుగులు, నాల్గవ బహుమతి అరిగెల వైష్ణవి ఇనిమెట్ల రాజుపాలెం మండలం, మల్లంపాటి పూజితా చౌదరి కేసారిపల్లి గన్నవరం మండలం, కృష్ణా జిల్లా, సంయుక్త జత 3089 అడుగులు, ఐదవ బహుమతి అనె్నంగి వెంకటేష్ శ్రీ రుక్మిణీ పురం మాచవరం మండలం జత 2750 అడుగులు, ఆరవ బహుమతి మాదాల రామాంజనేయులు పెద కంచర్ల వినుకొండ మండలం జత 1500 అడుగులు నిర్ణీత సమయానికి దూరాన్ని లాగి విజేతలుగా నిల్చాయి. ఈ ఎడ్ల పోటీలకు న్యాయ నిర్ణీతగా గూడా శ్రీనివాసరావువ్యవహరించారు. కటకం రామారావు, గందె గోపాలరావు, వెలిదంటి జ్యోతి, గ్రామ పెద్దలు ఈ ఎడ్ల పోటీలను పర్యవేక్షించారు. ఈ పోటీలను తిలకించడానికి చుట్టు ప్రక్కల గ్రామాల నుండి రైతు సోదరులు పాల్గొన్నారు. నేడు గురువారం సేద్యపు విభాగంలో పోటీలు నిర్వహిస్తామని కమిటీవారు తెలిపారు.