గుంటూరు

టీడీపీ హయాంలోనే బీసీల సంక్షేమం, అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జనవరి 23: తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాకే రాష్ట్రంలో బీసీ కులాల ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు జరిగాయని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, మున్సిపల్‌చైర్మన్ గంజి చిరంజీవి అన్నారు. రాజమహేంద్రవరంలో ఈనెల 27న జరుప తలపెట్టిన టీడీపీ బీసీ జయహో సభ జయప్రదానికై బుధవారం పట్టణంలోని ఈద్గా ప్రాంగణంలో నియోజకవర్గ స్థాయి బీసీ సదస్సుకు చిరంజీవి అధ్యక్షత వహించి మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమానికి ఒక విజన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు అవిశ్రాంతంగా పని చేస్తున్నారని, రాజకీయంగా బీసీలను ప్రోత్సహించింది టీడీపీయేనని చిరంజీవి అన్నారు. ఆదరణ పధకం కింద 90 శాతం సబ్సిడీతో బీసీలకు పరికరాలు అందజేయడం జరిగిందన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో 43 వేల కోట్లు బలహీన వర్గాల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం వెచ్చించిందన్నారు. బీసీ కులాల ప్రజలంతా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అండగా నిలవాలన్నారు. విజయవాడ నగర మాజీమేయర్ పంచుమర్తి అనూరాధ మాట్లాడుతూ టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని అన్నారు. వైఎస్ ప్రభుత్వ విధానాల వల్ల రెండు లక్షల మంది కార్మికులు వీధిన పడ్డారని, చేనేత కార్మికులకు రుణమాఫీ, మత్స్య, రజక, వడ్డెర, సగర, ఉప్పర, నారుూబ్రాహ్మణ, భట్రాజుల కులాలకు మేలు జరిగే విధంగా చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు జరుపుతున్నారని అనూరాథ అన్నారు. మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, పార్టీ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్ పోతినేని శ్రీనివాస్, జిల్లా బీసీ సెల్ అధ్యక్ష కార్యదర్శులు థామస్, గంగాధర్, మార్కెట్‌యార్డు చైర్మన్ వల్లభనేని సాయిప్రసాద్, వైస్‌చైర్మన్ గుత్తికొండ ధనుంజయరావు, వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ మహమ్మద్ ఇబ్రహీం, మున్సిపల్ వైస్‌చైర్మన్ సంకా బాలాజీగుప్తా, పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు ఎంవీ మారుతీరావు, వెలగపాటి విలియం, జీడీసీసీబీ డైరెక్టర్ తోట పార్ధసారథి, నందం అబద్దయ్య, ఆకుల జయసత్య, ఆరుద్ర భూలక్ష్మి, రేకా సుధాకర్, చావలి ఉల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. వేదికపైకి పిలవలేదనే కారణంతో బీసీ నాయకురాళ్లు ఉద్దంటి పద్మావతి, మరికొందరు అలిగి సభాస్థలి నుంచి వెళ్లిపోయారు. వేదికపై పెట్టిన ఫ్లెక్సీలో మంత్రి యనమల రామకృష్ణుడు ఫొటో లేకపోవడంపై యాదవసంఘం ప్రతినిధులు ప్రశ్నించడంతో సభ జరుగుతుండగానే రామకృష్ణుడు ఫొటో తీసుకొచ్చి ఫ్లెక్సీపై అంటించారు.