ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ గూటికి నెల్లూరు వైసీపీ నేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 25: నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పేరం మధునాయుడు తన అనుచరులతో ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. శుక్రవారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయనకు టీడీపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ నాయకులు పరసా వెంకటరత్నం, బీదా మస్తాన్‌రావు ఆధ్వర్యంలో తన అనచరులతో మధునాయుడు టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధికి అహరహం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అండగా నిలవాలనే ఉద్దేశంతో పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. జిల్లాలో టీడీపీ బలోపేతానికి తమవంతు అంకితభావంతో పనిచేస్తామని స్పష్టం చేశారు.
ఈసీది నియంతృత్వ ధోరణి: తులసిరెడ్డి

విజయవాడ, జనవరి 25: ఎన్నికల కమిషన్ నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణవాయువని, అలాంటి ఎన్నికల ప్రక్రియలో అనుమానాలకు తావుండకూడదని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈవీఎంల మీద 22 రాజకీయ పార్టీలకు, కొందరు సైబర్ నిపుణులకు, కొందరు ఓటర్లకు అనుమానాలు ఉన్నాయని, 1952 నుంచి 2004 వరకు అన్ని ఎన్నికలు బ్యాలెట్ పేపరుతోనే జరిగాయని, ప్రస్తుతం పంచాయతీరాజ్, మునిసిపల్ ఎన్నికలు కూడా బ్యాలెట్ పేపరుతోనే జరుగుతున్నాయని తులసిరెడ్డి తెలిపారు. కొన్ని దేశాలు కొన్నాళ్ళు ఈవీఎంలు వాడి మళ్ళీ బ్యాలెట్ విధానానికి వచ్చాయని, బీజేపీ అగ్ర నాయకులు అద్వాని, సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేశారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఈవీఎంలతోనే రాబోవు సార్వత్రిక ఎన్నికలు జరుపుతామని కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని తులసిరెడ్డి అన్నారు.