క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో మండల పరిషత్ ఉద్యోగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగపాలెం, జనవరి 25: కొంత కాలం క్రితం వరకూ తన పై అధికారిగా పనిచేసి, ఉద్యోగ విరమణ చేసిన విశ్రాంత మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి (ఎంపీడీవో)కి సంబంధించిన బిల్లులు మంజూరుకు లంచం తీసుకుంటున్న సీనియర్ అసిస్టెంట్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వలపన్ని పట్టుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఏసీబీ ఏలూరు డీఎస్పీ వి గోపాలకృష్ణ కథనం ప్రకారం ఎం కృష్ణకుమారి లింగపాలెం ఎంపీడీవోగా పనిచేసి, ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం లభించే ఆర్థిక ప్రయోజనాలు తదితరాల మంజూరుకు సంబంధించి ఆమె కొంత కాలంగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
అయితే ఈ ఫైలు పంపించడానికి అదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కెవి కృష్ణారావు రూ.10వేలు లంచం డిమాండుచేశాడు. దీనిపై జిల్లా పరిషత్ అధికార్లకు ఫిర్యాదుచేసినా ఫలితం లేకపోయింది. విసిగిపోయిన కృష్ణకుమారి ఏలూరులోని ఏసీబీ అధికార్లను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు ముందుగా రూ.5000, పని ముగిసిన అనంతరం మరో రూ.5000 ఇస్తామని కృష్ణకుమారి సోదరుడు చినబాబు సీనియర్ అసిస్టెంట్ కృష్ణారావుతో ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం లింగపాలెం మండల పరిషత్ కార్యాలయంలో చినబాబు నుండి రూ.5000 లంచం తీసుకుంటున్న కృష్ణారావును ఏసీబీ అధికార్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి నుండి లంచం సొమ్ము రూ.5000 స్వాధీనం చేసుకున్నారు. కృష్ణారావుపై కేసు నమోదుచేశామని, అతడిని అరెస్టుచేసి, ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. కృష్ణారావుపై ఇంకా పలు ఆరోపణలుండటంతో వాటిపై కూడా దర్యాప్తుచేస్తున్నామని తెలిపారు.