ఆంధ్రప్రదేశ్‌

నిరవధిక సమ్మెకు ఎన్‌ఎంయూ నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 25: ఏపీఎస్ ఆర్టీసీలో నిరవధిక సమ్మె అనివార్యంగా కన్పిస్తోంది. గుర్తింపు పొందిన తొమ్మిది కార్మిక సంఘాల్లో ఎన్‌ఎంయు మినహా మిగిలిన ఎనిమిది సంఘాలు గుర్తింపు సంఘం ఈయుతో కూడిన జేఏసీ ద్వారా ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి నిరవధిక సమ్మెకు ఇంతకు ముందే యాజమాన్యానికి నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలుత ఈ సమ్మెకు వెలుపల నుంచి మద్దతునిస్తానన్న అతిపెద్ద సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ అత్యవసర సమావేశం రాష్ట్ర అధ్యక్షులు చల్లా చంద్రయ్య అధ్యక్షతన శుక్రవారం జరిగింది. అపరిష్కృత డిమాండ్‌ల సాధనకై నిరవధిక సమ్మె చేపట్టాల్సిందేనని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. ముందుగా రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్‌తో చర్చలు జరిపి ఫిబ్రవరి 8వ తేదీ తర్వాత సమ్మెలోకి వెళ్లాలనని నిర్ణయించారు. ఈ నెల 28వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల కమిటీలతో విస్తృత సమావేశం ఏర్పాటు చేసి సమ్మె సన్నాహాక కార్యక్రమం చేపట్టాలని ఫిబ్రవరి 1వ తేదీ 13 జిల్లాల్లోనూ రీజనల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ముట్టడి కార్యక్రమం చేపట్టి కార్మికులను సమ్మెకు సన్నద్ధం చేయాలని తీర్మానించారు.
సమావేశం అనంతరం రాష్ట్ర అధ్యక్షులు చల్లా చంద్రయ్య, రాష్ట్ర కార్యనిర్యహక అధ్యక్షులు పివి రమణారెడ్డి, ముఖ్య ఉపాధ్యక్షులు డి సూర్యప్రకాశరావు, ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు సాయంత్రం సంస్థ ఎండీ ఎన్‌వి సురేంద్రబాబును కల్సి సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా సురేంద్రబాబు సమ్మె యోచనను విరమింప చేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. గత రెండేళ్లుగా అందరం కల్సి శ్రమించి మొత్తంపై నష్టాలను కొంతమేర తగ్గించగల్గామని ప్రస్తుత పరిస్థితుల్లో 20 శాతం మధ్యంతర భృతిని ఇవ్వగల్గుతామని, ప్రభుత్వ తోడ్పాటు ఉంటే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఐఆర్ ఇవ్వడానికి ఇబ్బంది లేదన్నారు. ఇక ఎన్‌ఎంయు నేతలు తమ సమ్మె నోటీస్‌లో 29 డిమాండ్లను ప్రస్తావించారు.