మిస్టర్ మజ్ను నచ్చేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఖిల్ అక్కినేని హీరోగా బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సారథ్యంలో దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం -మిస్టర్ మజ్ను. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సక్సెస్‌ఫుల్‌గా రన్నవుతోన్న నేపథ్యంలో చిత్రం యూనిట్ కేక్ కటింగ్‌తో సెలబ్రేషన్స్ చేసింది. అఖిల్ అక్కినేని మాట్లాడుతూ ఆడియన్స్‌తో కలిసి థియేటర్‌లో సినిమా చూస్తున్నపుడు వచ్చిన రెస్పాన్స్‌కు హ్యాపీ అనిపించింది. పూర్తిస్థాయి కుటుంబ కథాచిత్రం చేయాలనే మిస్టర్ మజ్ను చేశా. తమన్ మ్యూజిక్, వెంకీ కంటెంట్, నవీన్ నూలి ఎడిటింగ్ అన్నీ కలిసొచ్చాయి. నిర్మాత బీవీఎస్‌ఎన్ గాడ్‌ఫాదర్‌లా ముందుండి సినిమా నడిపించారు. నిధి పెర్ఫార్మెన్స్ చెప్పాల్సిన పని లేదు. ఏడెనిమిది నెలల కష్టానికి తగిన ఫలితం అందినందుకు ఆనందంగా ఉంది అన్నాడు. నిర్మాత బీవీఎస్‌ఎన్ మాట్లాడుతూ సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఏయన్నార్, నాగార్జున, ఇప్పుడు అఖిల్‌కు మజ్ను టైటిల్ పెద్ద మైలురాయిలా నిలుస్తోంది. వీలైనంత త్వరలో అఖిల్‌తో మరో సినిమా చేస్తానని ప్రకటించారు. హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ అఖిల్ పెర్ఫార్మెన్స్ అద్భుతం. మా కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌటైంది. మంచి పాత్రనిచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అంది.