రవితేజ డిస్కోరాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ మహారాజ రవితేజ మరో పవర్‌ఫుల్ మాస్ అండ్ క్లాస్ సినిమాతో అభిమానులు ముందుకి రాబోతున్నారు. డిఫరెంట్ కానె్సప్ట్‌ని కథాంశాలుగా ఎంచుకుంటూ విమర్శకులు, ప్రేక్షకుల ఆదరణ అందుకుంటున్న క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ ఎనర్జీకి సరిపోయేలా సినిమాకు డిస్కోరాజా టైటిల్ ఖరారు చేశారు. జనవరి 26 రిపబ్లిక్‌డేతోపాటు రవితేజ పుట్టినరోజు సందర్భంగా డిస్కోరాజా టైటిల్ లోగోని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ రవితేజతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం హ్యాపీగా ఉందన్నారు. వినూత్న కథల్ని ప్రేక్షకులకు అందించటంలో ఎప్పుడూ ముందుంటామని, అలా దర్శకుడు విఐ ఆనంద్ చెప్పిన కథ నచ్చి ఓకే చేశామన్నారు. రవితేజ ఇప్పటివరకు టచ్‌చేయని జానర్‌లో సినిమా తెరకెక్కనుందని, వినూత్నమైన అంశాన్ని సినిమా కథగా తీసుకున్నామన్నారు. హైదరాబాద్‌తోపాటు గోవా, చెన్నై, లడాఖ్, మనాలీ, నార్త్ ఇండియాలో కొన్నిచోట్ల సినిమాను చిత్రీకరణకు ప్లాన్ చేశామన్నారు. ప్రీప్రొడక్షన్ మొదలుపెట్టిన రోజునుంచే చిత్రానికి కొన్ని క్రేజీ టైటిల్స్ అనుకుంటూ వచ్చాం. అన్నివర్గాలను ఎంటర్‌టైన్ చేసేలా సినిమా రూపొందించేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తుందన్నారు. అందుకే మాస్, క్లాస్‌ని ఆకట్టుకునే రీతిలో ‘డిస్కోరాజా’ టైటిల్‌ని ఖరారు చేశామన్నారు. దర్శకుడు విఐ ఆనంద్‌తోపాటు టాలీవుడ్‌లోని బెస్ట్ టెక్నీషియన్స్ సినిమాకు పనిచేస్తున్నారు. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు అందిస్తారని, సినిమాటోగ్రఫీ సాయిశ్రీరామ్ అందిస్తారన్నారు. రవితేజ సరసన ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, ప్రముఖ నటుడు బాబీసింహా ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడన్నారు.