ఎవరికోసం ఎదురు చూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ చేస్తున్న మల్టీస్టారర్ -ట్రిపుల్ ఆర్. రెండో షెడ్యూల్ మొదలైంది. ఫస్ట్ షెడ్యూల్‌లో యాక్షన్ సీన్లు చిత్రీకరించిన దర్శకుడు రాజవౌళి, రెండో షెడ్యూల్‌లోనూ చరణ్, ఎన్టీఆర్‌ల కాంబోలో కొన్ని యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఇదే టైంలో ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపిక విషయంపై స్పీడ్‌గా చర్చలు జరుపుతున్నారట. వచ్చేనెల నుంచి హీరోయిన్లతో చిత్రీకరణకు దర్శకుడు రాజవౌళి ప్లాన్ చేశాడని టాక్. ఇప్పటికే చాలామంది హీరోయిన్ల పేర్లు పరిశీలించిన జక్కన్న -బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా వద్ద ఆగాడని అంటున్నారు. పరిణితిని సంప్రదించడం, ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం జరిగిందనీ వినిపిస్తోంది. బాలీవుడ్‌లో పలు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించిన పరిణితి చోప్రా ఈమధ్య కాస్త సందడి తగ్గించింది. ఇక ట్రిపుల్ ఆర్ కోసం మరో బాలీవుడ్ భామనే ఎంపిక చేస్తారని వినిపిస్తోంది. ఇదిలావుంటే, కొద్దిరోజుల క్రితం ప్రాజెక్టులోకి కోలీవుడ్ ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ సముద్రఖని యాడ్ అవుతున్నాడంటూ వచ్చిన వార్తలు నిజమయ్యాయి. సినిమాలో ఆయన ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఇది సముద్రఖని చేస్తున్న స్ట్రెయిట్ తెలుగు మూవీ. సుమారు 300 కోట్ల బడ్జెట్‌తో పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్న చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న చిత్రానికి సెంథిల్‌కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.