స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-202

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
అది ఇతరులకు సాధ్యపడేది కూడా కాదు. నిర్థారించుకొన్న లక్ష్యాలను సాధించేందుకు యోగ్యమైన సాధనాలను ఆ మనిషికి సమర్థులైనవారు కొందరు సూచించవచ్చునేమోగాని నిర్థారించుకొన్న జీవన లక్ష్యాల సాధనకై చేసే కార్యాలలో నిమగ్నుడు కావడం స్వేచ్ఛగా జరగాలని వేదం మంత్రంలో ‘స్వయమ్’ శబ్దాన్ని ప్రయోగించింది.
శుక్లయజుర్వేదం ఈ భావానే్న ‘స్వయం యజస్వ స్వయం జుషస్వ’-
స్వయంగా నీ పనిని చేసుకో. దాని పలితాన్ని నీవే అనుభవించు’’ అని చాలా సూటిగా చెప్పింది. గుఱ్ఱం రథపు కాడిని ధరించినట్లుగా జీవితంలో లక్ష్యసాధన అనే కార్య ‘ప్రతరణీ’ కాడిని ధరించడం కష్టమే. అయినా ‘అవస్యువమ్’ లక్ష్యాన్ని చేర్చేది ఆ మార్గంలో రక్షణ కలిగించేది అయిన ఆ జీవనపు కాడిని ధరించడం చాలా ముఖ్యం. ఎవరైనా ఆ జీవన లక్ష్యపు కాడిని విడిచిపెడదామనుకొంటే వారు లక్ష్యాన్ని కూడా చేరుకోలేరు.
శ్రేయాంసి బహు విఘ్నాని ‘శుభకార్యాలకు విఘ్నాలెక్కువ’ అన్న సూక్తి అందరకు తెలిసినదే. అయినా విఘ్నాలకు భయపడి అధములు అసలు పనులనే ఆరంభించరు. మధ్యమ జాతి మనుష్యులు ‘విరమంతి మధ్యే’ మధ్యలోనేవిడిచిపెడతారు. కాని ధీరులు మాత్రం విఘ్నాలెన్ని వచ్చినా భీతి చెందక ఆరంభించిన పనులను పరిసమాప్తి చేస్తారు. భర్తృహరి చెప్పిన ఈ జీవన సూత్రాన్ని ఋగ్వేదం వేల ఏండ్ల క్రితమే నాస్యావశ్మి విముచం నావృతం పునః ‘జీవన లక్ష్యపు కాడి నుండి విడుదల పొందేందుకు కోరుకోను. అట్లే ఆ కాడి నుండి శాశ్వతంగా వెనుదిరిగిపోయేందుకు కూడ ఇష్టపడను’ అని చెప్పింది. ఇదే కార్యసాధకుని ‘న్యయ్యాత్పథః ప్రవిచలంతి పదం న ధీరాః’-‘‘్ధరులు న్యాయమార్గం నుండి ఒక్క అడుగు కూడా వెనుకకు వేయరు’’ అని శ్లాఘించాడు. బహుశా భర్తృహరి కూడా ఈ మంత్రంలోని ‘విద్వాన్ పథః పుర ఏత ఋజునేషతి’’- ‘‘మార్గం మరియు జీవన లక్ష్యం తెలిసిన విద్వాంసుడు నేరుగా అచటకే తీసుకొనిపోగలడు’’ అన్న వాక్యానికి ముగ్ధుడయ్యే ఆ మాట అన్నాడేమో’’.
వరుణదేవా! పాపచింతన అనే త్రాటిని త్రెంచివేయుము
వి మచ్ఛ్థ్రాయ రశనామివాగ బుధ్యామ తే వరుణ భామృతస్య
మా తంతు శే్ఛది వయతో ధియం మే మా మాత్రా శార్యాపసః పుర ఋతోః
భావం:- ఓ వరుణ భగవాన్! నాలోని పాపచింతన అనే త్రాటిని తెంపి వేయుము. నీ ఋతాన్ని అనగా శాసనాలను, ధర్మాలను కొనసాగిస్తాను. బుద్ధి, కర్మ, జ్ఞానమనే వానిని పడుగుపేకలుగా చేసి జమిలి (కలిపి) నేసిన నా జీవన తంతువు తెగిపోకుండ కాపాడుము. నా జీవిత లక్ష్యం నెరవేరక క్షణకాలం ముందుకూడ తెగిపోకుండుగాక!
వివరణ:- పాపతాపనాశక వరుణదేవా! నిన్ను శరణువేడుకొంటున్నాను. పాప వాసన (చింతన) అనే అగ్నిజ్వాలల్లో మాడిపోతున్నాను. దానిని శాంతింపచేయి. నా పాపమనే త్రాడు చాలా పొడవైనది. అది నన్ను చిక్కుముడులలో బంధించేస్తున్నది. నా వినతి ఏమంటే- ‘వి మచ్ఛ్థ్రాయ రశనావమివాగః’ ‘‘త్రాడులా నన్ను బంధించిన పాపవాసననుండి విముక్తుణ్ణి చేయి’’ ఓ ప్రభూ! నేను పాపంనుండి విముక్తిని అర్థించడం లేదు. దానికి మూలకారణమైన పాపచింతన నుండి మాత్రమే విముక్తిని కోరుతున్నాను. ‘సునీతిభిర్నయసి త్రాయసే జనం యస్త్భ్యుం దాశాన్న తమంహో అశ్నవత్’ ‘‘తమనుతామే నీకర్పణ చేసుకొన్న వారిని సన్మార్గంలో నడిపించి రక్షిస్తూ వారికి పాపమే అంటకుండా చేస్తావు’’అని నేను విన్నాను. మరియు-
న తమంహో న దురితం కుతశ్చ్న నారాతయన్తితిరుర్న ద్వయావినః
విశ్వా ఇదస్మాద్‌ధ్వరసో వి బాధసే యం సుగోపా రక్షసి బ్రహ్మణస్పతే॥
ఓ సర్వచరాచర మహాసంరక్షకా! నీవే సర్వజగత్తుకు సంరక్షకుడవు. నీవు చేపట్టి రక్షించిన వానికి పాపం మరియు దుర్గతుల స్పర్శకూడ ఉండదు. వారిని సమాజ శత్రువులుగాని, సర్పాది విష జంతువులు గాని దుఃఖం కలిగించజాలవు. దుఃఖమూ, పీడ మరియు బాధలు అట్టివానినుండి దూరంగా పారిపోతాయి.
కాబట్టి నేను నీకే సమర్పించుకొంటున్నాను. ఓ వరుణదేవా! దుఃఖాల నుండి విముక్తడనై నీ రక్షణకు పాత్రులమయ్యేందుకు ‘బుధ్యామ తే వరుణ ఖామృతస్య’ ‘‘నీ ఋత తంతువును మేము సదా కొనసాగిస్తాం. నీవు ఆదేశించిన ఆజ్ఞననుసరించి జీవిస్తాం.’’ మరియు ‘మా తంతుశే్ఛది వయతో ధియం మే’ ‘‘తదనుసారంగా జ్ఞాన, కర్మలనే పడుగుపేకల కలయికతో పేనబడిన జీవన తంతువు అర్ధాంతరంగా తెగిపోకుండుగాక!’’ నా జీవితోద్దేశ్యాన్ని ఈ జన్మలోనే పరిపూర్ణం చేసుకొంటాను. అందుకొఱకై ‘మా మాత్రా శార్యపసః పురః ఋతోః’ ‘‘నే చేయు కర్మ పూర్తికావడానికి ఒక మాత్రకాలం ముందుగాకూడ నా జీవితం మరియు కర్మవిచ్ఛిన్నం కాకుండుగాక!’’ అని నిన్ను ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన సఫలం కావాలంటే - నేను పాపవాసన మరియు చింతననుండి విముక్తుణ్ణి కావాలి. కాబట్టి పాప విధ్వంసక! ‘దామేవ వత్సాద్వి ముముగ్ధ్యంహః’ ‘‘కట్టబడిన త్రాటిని విప్పి బాలుణ్ణి రక్షించినట్లుగా నన్ను పాపవాసనా రజ్జువు వుండి విడివడ చేయుము’’ ఎందుకంటే-

ఇంకావుంది...