ఆంధ్రప్రదేశ్‌

సింహాచలం పంచగ్రామాల భూ సమస్య వెంటనే పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 27: 1996 పట్టాలను రద్దు చేయడం, రైతులను, ఇళ్ల యజమానులను హక్కుదారులుగా గుర్తించి విశాఖ జిల్లా సింహాచలం పంచగ్రామాల్లో భూముల క్రయవిక్రయాలను అనుమతించడం, 275 సర్వే నెంబర్‌లో పట్టాలు ఇవ్వడం ద్వారా సమస్యను వెంటనే పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు ఆదివారం సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. విశాఖ నగరంలో సింహాచలాన్ని అనుకుని ఉన్న పంచగ్రామాల భూసమస్యను 100రోజుల్లో పరిష్కరిస్తామని 2014 జూన్ 12న విశాఖలో జరిగిన టీడీపీ ప్రభుత్వ తొలి కేబినెట్ సమావేశంలో నిర్ణయించారని గుర్తుచేశారు. నేటికి 1600 రోజులు దాటినా ఈ సమస్యను పరిష్కరించ లేదన్నారు. సమస్యకు మూలమైన 1996 సంవత్సరంలో సింహాచలం దేవస్థానానికి ఇచ్చిన రైత్వారీ పట్టాలు చెల్లవని, సర్వే, సెటిల్‌మెంట్ కమిషనర్, విశాఖ ఆర్డీఓ కోర్టు, ముగ్గురు అధికారుల త్రిసభ్య కమిటీ నివేదికలో తెలిపినా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య పరిష్కారం కాలేదన్నారు. హైకోర్టు 2017లో సమగ్ర సర్వే జరపాలని సూచిస్తూ, అంతవరకు యథాతథ స్థితి కొనసాగించాలని తీర్పు ఇచ్చినా ప్రభుత్వం దాన్ని అమలు చేయడం లేదన్నారు. దేవస్థానం, ఇళ్ల యజమాన్యాలకు హైకోర్టు ఆర్డర్ సమానంగా వర్తిస్తాయని, కాని సింహాచలం దేవస్థానం అమ్మకాలు, నిర్మాణాలు జరుపుతోందన్నారు. ఇళ్ల యజమానులకు మాత్రం క్రయవిక్రయాలకు, నిర్మాణాలకు అనుమతించడం లేదన్నారు. ఇది హైకోర్టు ఆర్డర్ ఉల్లంఘనేనని, దీన్ని అమలుచేస్తే ప్రజలకు తాత్కాలికంగా కొంతమేరకైనా ఉపసమనం కలుగుతుందని మధు అ న్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం సమస్య పరిష్కార మార్గంపై విశాఖ జిల్లా కలెక్టర్ 2018 అక్టోబర్‌లో ప్రభుత్వానికి నివేదిక పంపారన్నారు. ఎస్టేట్ ఎబాలియేషన్ చట్టం 1948లో చిన్న సవరణ ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చని సూచించారని గుర్తుచేశారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వ అధికారులు చేసిన సూచనలనూ పరిగణనలోకి తీసుకోలేదన్నారు. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్నాయ ని, సమస్యను పరిష్కరించకపోతే ప్రభుత్వ విశ్వసనీయతే ప్రశ్నార్థకం అవుతుందని హెచ్చరించారు.