తెలంగాణ

ఉద్యాన వర్శిటీలో సోలార్ పవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: ములుగులో నిర్మాణంలో ఉన్న ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధాన భవనంలో ‘సోలార్ పవర్’ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి సంబంధిత అధికారులను ఆదేశంచారు. ఉద్యాన విశ్వవిద్యాలయం భవనాల నిర్మాణంపై చర్చించేందుకు సచివాలయంలో ఆదివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ములుగులోని ప్రధాన కార్యాలయంతో పాటు రాజేంద్రనగర్, మోజర్లలో ఉన్న ఉద్యాన కాలేజీల్లో కనీస వసతులు కల్పించాలని ఆదేశించారు. భవనాల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, ప్రయోగశాలలు, విద్యార్థుల వసతి గృహాలు, పరిశోధనాశాలలు తరగతి గదుల నిర్మాణం 2019 మార్చి చివరి వరకు పూర్తి చేయాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లు ఏర్పాటు చేసేందుకు వీలుగా వర్సిటీలో ఆడిటోరియాన్ని నిర్మించాలని పార్థసారథి సూచించారు. విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించిన ‘ఆర్నమెంటల్ గార్డెన్’ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు.