తెలంగాణ

ప్రైవేటు ఉద్యోగులకు ప్రభుత్వ అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: ప్రైవేటు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టీ. హరీష్ రావు హామీ ఇచ్చారు. ఆదివారం తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం డైరీని హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సమైక్య రాష్ట్రంలో ప్రైవేటు ఉద్యోగులను ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ప్రైవేటు ఉద్యోగుల పాత్ర మరువలేనిదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే ఉద్యోగం పోతుందని తెలిసి కూడా ధైర్యంగా పోరాటం చేశారని ఆయన చెప్పారు. కాబట్టి వారి సేవలను, పోరాటాన్ని ప్రభుత్వం మరిచిపోదని, వారికి అండగా ఉంటుందని ఆయన తెలిపారు.