పశ్చిమగోదావరి

మాతా, శిశు మరణాల నియంత్రణకు పటిష్ట ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 1: జిల్లాలో మాతా, శిశు మరణాల నియంత్రణకు వైద్య, ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుని పటిష్ట ప్రణాళిక అమలు చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం మహిళా శిశు సంక్షేమ ప్రగతి తీరును సంబంధిత అధికారులతో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సమీక్షించారు. జిల్లాలో మాతా శిశు మరణాలపై సమగ్ర ఆడిట్ నిర్వహించి అందుకు సంబంధించిన కారణాలను విశే్లషించాలన్నారు. ఏ ప్రాంతంలో మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయో ఆయా గ్రామాల వారీగా సమీక్షించుకుని, ఆ ప్రాంత ప్రజలను చైతన్యపరచాలన్నారు. మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గించడంపై దృష్టి పెట్టాలని, ప్రస్తుతం సంభవిస్తున్న సంఖ్యకు మించి వెళ్లేందుకు ఎంతమాత్రం వీలులేదన్నారు. అందుకు తగిన విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గర్భిణులకు అవసరమైన పౌష్టికాహారాన్ని నిర్ధిష్ట సమయాల్లో అందేలా చూడాలన్నారు. జిల్లాలో బాల సంజీవని, అన్న అమృత హస్తంను కలెక్టర్ సమీక్షించారు. అన్న అమృత హస్తం కింద ఉదయం పాలు, కోడిగుడ్డు అందించడంతోపాటు మధ్యాహ్నం 3 గంటల సమయంలో వారం రోజులపాటు అందించే పౌష్టికాహార మెనూను కచ్ఛితంగా అమలు చేయాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా గర్భిణులకు, బాలలకు అందిస్తున్న పౌష్టికాహారం, ఇతర కార్యక్రమాల అమల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లు ఆశ కార్యకర్తలను ఎప్పటిప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతల్లో రక్తహీనతను తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకుని ప్రధానంగా కౌమార దశ యువతుల్లో అవగాహన చైతన్యం కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి బాల సురక్ష కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. జిల్లాలో ఉపాధి హామీ కింద 948, ఆర్‌ఐడిఎఫ్ కింద 19 అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు మంజూరు చేశామని, అయితే నరేగ కింద 823 మాత్రమే నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, ప్రారంభం కాని 125 నిర్మాణాల విషయంపై సంబంధిత తహసీల్దార్లతో సమన్వయం చేసుకుని పనులు ప్రారంభించాలన్నారు. బాల్య వివాహాల నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గృహ హింస చట్టం కింద నమోదైన కేసులను కలెక్టర్ సమీక్షిస్తూ ఇంతవరకూ 2,751 కేసులు నమోదు కాగా వాటిలో 797 కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయని, మరో 750 కేసులు రాజీ చేసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కిశోర్ వికాసం ఫేజ్-2, సఖి, సమగ్ర శిశు సంరక్షణ పథకం అమలు తీరును సమీక్షించారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ విజయకుమారి, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, ఐసీపీఎస్ అధికారి సూర్యచక్రవేణి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో బంద్ పాక్షికం
భీమవరం, జనవరి 1: ప్రత్యేక హోదా కోసం రాష్టబ్రంద్‌కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినా ఆ వైపు ఎవ్వరూ చూడలేదు. ప్రత్యేక హోదా నినాదం అన్నా బంద్‌కు ఎవ్వరూ సహకరించలేదు. యధావిధిగా విధులకు ఉద్యోగులు హాజరయ్యారు. వ్యాపారులు జోరుగానే వ్యాపారం చేసుకున్నారు. ఇది జిల్లాలో బంద్ పాక్షికంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రత్యేక హోదా కోసం బంద్ పిలుపునకు ముందు ఆర్టీసీ సంస్థ భయాందోళన చెందింది. ఉదయం కొద్ది సేపు బస్సులను డిపోలకే పరిమితం చేసింది. కొద్ది సమయానికే పునరాలోచన చేసి ప్రయాణీకులను ఇబ్బందులకు గురి చేయకుండా ఉండాలని భావించి యధావిధిగా సర్వీసులను నడిపింది. వాహనాలపై ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. దుకాణ యజమానులు ఉదయం దుకాణాలను తెరిచే సమయంలోను, ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు చేరుకునే సమయంలో ఎవరైన ప్రత్యేక హోదా నినాదాలతోను, జెండాలతోను వస్తారని భావించారు. కొద్ది సేపటికీ ఎవరూ కనిపించకపొవడంతో ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకుని వేలిముద్ర హాజరువేసుకుని విధులకు హాజరుకావడం కనిపించింది. మున్సిపల్ కార్యాలయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ పని చేశారు. ప్రజలకు సేవలను అందించారు. ఇక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలైన తపాలా కార్యాలయం బీఎస్‌ఎన్‌ఎల్, ఆదాయపు పన్నుశాఖ, కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్నీ పని చేశాయి. ప్రజలు అక్కడకు వెళ్ళి వారి పని చేసుకున్నారు. ఇక రాజకీయ పార్టీల విషయానికి వస్తే సీపిఎం, సీపిఐ, ఎఐటీయూసీ వంటి పార్టీలు, సంఘాలు అతి కొద్ది మందితో బ్యానర్లును పట్టుకుని నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు జిల్లాలో ఎక్కడా జాడలేదు.
అక్కడక్కడ తెలుగుదేశంపార్టీ నేతలు
జిల్లాలోని అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపునందుకుని నల్లబ్యాడ్జీలను ధరించి ఆ పార్టీ నేతలు ఆందోళనలు చేశారు. ప్రధాన మైన కూడళ్ల వద్ద భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, ప్రత్యేక హోదా కావాలి అని నినాదాలు చేశారు. పార్టీ నేతలు కూడా ఈ కార్యక్రమానికి కొందరితోనే చేయడం విశేషం. ఈ రాష్ట్రంపై బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆ పార్టీ నేతలు మైకుల్లో మాట్లాడారు. ప్రత్యేక హోదా బంద్‌కు వైసీపీ, జనసేన పార్టీలు దూరంగా ఉన్నాయి.

ప్రజారంజకంగా కేంద్ర బడ్జెట్
బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోడూరి
తణుకు, ఫిబ్రవరి 1: కేంద్ర ఆర్థిక మంత్రి గోకుల్ ప్రవేశపెట్టిన బడ్జెట్టు ప్రజారంజకంగా ఉందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా అధ్యక్షుడు కోడూరి లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ప్రవేశపెట్టిన బడ్జెట్టుకు మద్దతుగా స్థానిక బీజేపీ కార్యకర్తలు నరేంద్ర సెంటర్‌లో సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచిపెట్టుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోడూరి మాట్లాడుతూ బీజేపీ ప్రజల పక్షంగా పాలన అందిస్తోందన్న సంకేతాన్ని ఈ బడ్జెట్టు తేటతెల్లం చేస్తోందన్నారు. రూ.2.5 లక్షలు ఉన్న ఆదాయ పన్ను పరిధిని రూ.5 లక్షలకు పెంచి మధ్యతరగతి ఉద్యోగులు, ప్రజలకు ఊరటనిచ్చినట్టు తెలిపారు. అలాగే 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరే పథకాన్ని బడ్జెట్టులో పొందుపర్చినట్టు చెప్పారు. రూ.11 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు ఉపయోగపడే విధానాన్ని ఈ బడ్జెట్టులో ప్రవేశపెట్టినట్టు కోడూరి వివరించారు. పెద్ద మొత్తాల రద్దు, జీఎస్టీ వల్ల పెరిగిన ఆదాయంతో అనేక ప్రజాహిత కార్యక్రమాలకు బడ్జెట్టును కేంద్ర ఆర్థిక శాఖ కేటాయించిందన్నారు. బీజేపీ సీనియర్ నేత పివిఎస్ వర్మ మాట్లాడుతూ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే అవమానపరుస్తూ సీఎం చంద్రబాబు మాట్లాడిన తీరు క్షమించరాదన్నారు. దీనికి ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్పగలరన్నారు. కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్ మల్లిన రాధాకృష్ణ, పార్టీ నాయకులు నార్ని తాతాజీ, చుండూరి శేషాద్రి శాస్ర్తీ, శ్రీనివాస్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

టిఎన్‌కె 2- తణుకులో బీజేపీ శ్రేణుల సంబరాలు

ఆసుపత్రి అభివృద్ధి కమిటీకి కలెక్టర్ ప్రశంసలు
ఏలూరు, ఫిబ్రవరి 1: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి చక్కటి సమన్వయంతో, మానవతా భావంతో కృషి చేస్తున్న ఆసుపత్రి అభివృద్ధి కమిటీని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ అందరి సహకారంతో ఆసుపత్రిని ఆదర్శవంతంగా నిలిపేందుకు, మరింత అభివృద్ధి పరిచేందుకు కలిసి పనిచేద్దామన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యకళాశాల మంజూరు కావడం చాలా సంతోషకరమని, అటువంటి విషయాల్లో ముఖ్యమంత్రి సానుకూలంగా వ్యవహరిస్తారన్నారు. తాను అందుబాటులో ఉన్నంత మేరకు ప్రతి నెలా మొదటి శుక్రవారం నిర్వహించే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి హాజరై అనుభవజ్ఞులు, పెద్దలు చేసే సూచనలు పరిగణనలోకి తీసుకుని, అవసరమైన చర్యలు తీసుకుంటానన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించి ఏ సమస్య ఉన్నా కచ్ఛితంగా పరిష్కరిస్తానన్నారు. సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏవిఆర్ మోహన్, రిటైర్డ్ అధికారి ప్రసాద్ ఆసుపత్రి అభివృద్ధికి ఇంతవరకు చేపట్టిన అంశాలను వివరించారు. తొలుత కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను ఎమ్మెల్సీ రాము సూర్యారావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ మోహన్, గైనకాలజిస్టు డాక్టర్ పద్మ, డీసీహెచ్ డాక్టర్ శంకర్‌రావు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. సమావేశంలో డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, నగరపాలక కమిషనర్ మోహనరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు శలాకోట వీరయ్య, డాక్టర్ రావి గోపాలకృష్ణ, మానవత నాగేశ్వరరావు, కడుపు కన్నయ్య, తనే్నరు బుజ్జి, కృష్ణారావు, బొల్లినేని నారాయణ, ఎల్ వెంకటేశ్వరరావు, మధుబాబు, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.
భీమవరంలో ఆపరేషన్ గోల్డ్ఫిష్ చిత్రం యూనిట్ హల్‌చల్
భీమవరం, ఫిబ్రవరి 1: భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆపరేషన్ గోల్డ్ఫిష్ చిత్రం యూనిట్ సందడి చేసింది. శుక్రవారం కళాశాలలో ఐటి డిపార్ట్‌మెంట్ ఆద్వర్యంలో టెక్‌ఫ్లీట్-19 జాతీయస్థాయి విద్యార్థి సింపోజియం ముగింపు వేడుకలను అట్టహాసంగా చేశారు. ఎస్‌ఆర్‌కెఆర్ డిజిటల్ ఫిల్మ్ స్టూడియో నిర్మించిన సావరీయ షార్ట్ ఫిల్మ్ ఆడియోను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి పార్ధసారధివర్మ ఆవిష్కరించారు. హీరోయిన్ నిత్యామీనన్, సింగర్ యామిని, సంగీత దర్శకుడు శ్రీచరణ్, రచయిత అబ్బూరి రవి సందడి చేశారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా. పి శ్రీనివాసరావు, ఐ హేమలత, కె శ్రీనివాస్, కె కిషోర్‌బాబు, ఉదయ్‌కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
జనసేన వీరమహిళ రాష్ట్ర వైస్ ఛైర్మన్‌గా కనుమూరి

జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటన
భీమవరం, ఫిబ్రవరి 1: యువత దేశ రాజకీయాల్లో బలమైనపాత్ర పోషించాలి, బడుగు బలహీనవర్గాలకు సముచిత రాజకీయ ఫలాలు దక్కాలి, మహిళాశక్తికి రాజకీయ సాధికారిత అందించాలన్న తలంపుతో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ పార్టీ కమిటీల్లో అదేస్థాయిలో యువతకు, మహిళకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. శుక్రవారం రాత్రి వీరమహిళా విభాగం రాష్ట్ర కమిటీని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ కమిటీలో వైస్ ఛైర్మన్‌గా భీమవరంలోని క్షత్రియ సామాజికవర్గానికి చెందిన కనుమూరి కవితా సింధూరిని నియమించారు. పవన్ కళ్యాణ్ భీమవరంలోని శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో విడుదల చేసిన మ్యాన్‌ఫెస్టోను ప్రజల ముందుకు తీసుకెళ్లడం, వారిలో చైతన్యం తీసుకురావడంతోపాటు జనసేన సిద్ధాంతాలను ఎంతో క్రమశిక్షణతో ప్రజల్లోకి తీసుకువెళ్ళడం వంటి పార్టీకి చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర వైస్ చైర్మన్‌గా నియమించారు.
వైసీపీ పథకాలు కాపీ చేసిన చంద్రబాబును డిబార్ చేయాలి
పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం కన్వీనర్ మార్గాని
దేవరపల్లి, ఫిబ్రవరి 1: వైసీపీ సంక్షేమ పథకాలను కాపీ చేసిన చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రం నుంచి డిబార్ చేయాలని రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం ఆ పార్టీ కన్వీనర్ మార్గాని భరత్ రామ్ డిమాండు చేశారు. మండలంలోని చిన్నాయగూడెంలో శుక్రవారం నిన్ను నమ్మం బాబూ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వైసీపీ విజయానికి కార్యకర్తలంతా సమిష్టిగా కృషిచేసి రాజమహేంద్రవరం ఎంపీగా తనను, గోపాలపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావును గెలిపించాలని కోరారు. రాజన్న రాజ్యం రావాలంటే జగన్ సీఎం కావాలని అభిప్రాయపడ్డారు. జగన్ రూపొందించిన నవరత్నాల పథకాలను కాపీ కొడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ప్రజలు క్షమించరన్నారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు. డ్వాక్రా మహిళలకు రూ.10వేలు పసుపు-కుంకుమగా ఇస్తామని చెప్పి ఇప్పుడు మూడు దశల్లో ఇస్తామని చెక్కులు ఇవ్వటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికైనా డ్వాక్రా మహిళలు చంద్రబాబు మోసాలను గుర్తించాలన్నారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోను, అలాగే లోక్ సభ 25 స్థానాలను గెలిపించి రాజన్న రుణం తీర్చుకోవాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన గోపాలపురం నియోజకవర్గ ఆ పార్టీ కన్వీనర్ తలారి వెంకట్రావు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో అనుకోని విధంగా తాను ఓటమి చెందినా గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర వైసీపీ కార్యదర్శులు కెవికె దుర్గారావు, ఎన్ రాజేంద్రబాబు, సిహెచ్ రాజబాబు, పార్టీ నేతలు జి రాంబాబు, జి జగదీష్, కె సతీష్, జి జనార్ధనరావు, కె రమేష్, ఎ అనసూయ, కె రాజ్యలక్ష్మి, ఎం గంగరాజు తదితరులు ప్రసంగించారు. సమావేశంలో పార్టీ నేతలు టి వెంకట్రామరెడ్డి, కె రామకృష్ణ, ఎ సురేష్, పివి రత్నారెడ్డి, కె రాంబాబు, ఎం శ్రీనివాసరెడ్డి, ఎస్‌కె జాలిబ్, దేవరపల్లి, గోపాలపురం మండలాలకు చెందిన 2వేల మంది పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కాగా రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ భరత్ రామ్ శుక్రవారం చిన్నాయగూడెం వచ్చిన సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సంగాయగూడెం, గాంధీనగరం, సార్క్ నగర్, చిన్నాయగూడెం గ్రామాల మీదుగా సుమారు 6 కిలోమీటర్ల మేర కొనసాగింది. చిన్నాయగూడెంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.
ఆకివీడులో బంద్ ప్రభావం నిల్
ఆకివీడు, ఫిబ్రవరి 1: ఒకటే హృదయం కోసమూ..,ఇరువురితోటి దోషమూ...అన్న పాట మాదిరిగా ఉంది. ఆకివీడులో శుక్రవారం ప్రత్యేక హోదాపై చేపట్టిన ఆందోళన. ఒకేచోట రెండు వేర్వేరు పార్టీలు చేపడుతున్న ఆందోళన ఎవరికీ అర్థంకాని పరిస్థితిని మిగిల్చాయి. ప్రత్యేక హోదా కోరుతూ హోదా సమితి ఇచ్చిన బంద్ ఆకివీడులో ఎటువంటి ప్రభావం చూపలేదు. కానీ కాంగ్రెస్, సీపీఎం నాయకులు చేపట్టిన ఆందోళనా కార్యక్రమాలు ప్రజలను మీమాంసలో పడేశాయి. స్థానిక పాత బస్టాండు సెంటర్ వద్ద చేపట్టిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేయగా, సీపీఎం నాయకులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసిందన్నారు. ఏది ఏమైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో గాదిరాజు లచ్చిరాజు, అంకెం సీతారామ్, బొల్లం ఏడుకొండలు, వేగేశ్న వెంకట కృష్ణంరాజు, ఆరేటి రంగారావు, జెఎస్‌ఆర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సీపీఎం నాయకులు తమ ప్రసంగాలలో సీఎం చంద్రబాబు ఆనాడు హోదా వద్దు..ప్యాకేజి ముద్దు అని చెప్పి నేడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. కార్యక్రమంలో బొక్కా సత్యనారాయణ, గేదెల అప్పారావు, కె తవిటినాయుడు, పెంకి అప్పారావు, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ప్రధాని మోదీ: ఎమ్మెల్యే సుజాత
జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 1: ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన మాట తప్పి ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలను మోసం చేసారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీతల సుజాత విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు శుక్రవారం జరిగిన బంద్ కార్యక్రమానికి ఆమె స్పందించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఆమె కూడా నల్లదుస్తులు ధరించి అసెంబ్లీకి హాజరై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఇక్కడి విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికిగాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి గాని, విశాఖ రైల్వే జోన్‌కిగాని కనీస నిధులు కేటాయించకుండా మరోసారి రాష్ట్ర ప్రజలను నిరాశపరిచారని ఆందోళన వ్యక్తం చేసారు. 2014 ఎన్నికల్లో వలే మాటల గారడీచేసి, అమలు చేయని హామీలు గుప్పించి మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ, నరేంద్రమోదీ చూస్తున్నారని విమర్శించారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న నిరసనలు చూసి, కేంద్రం దిగి వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని, లేకపోతే రానున్న ఎన్నికల్లో బిజెపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

బీజేపీని గద్దె దింపేవరకు పోరాడతాం
ఉండి ఎమ్మెల్యే వేటుకూరి
కాళ్ల,్ఫబ్రవరి 1: బీజేపీని కేంద్రంలో గద్దె దింపేవరకు పోరాడతామని ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు స్పష్టంచేశారు. శుక్రవారం స్థానిక మండలపరిషత్ కార్యాలయంలో అధికారులు,ప్రజాప్రతినిధులతో కలిసి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరితంగా విభజించి తెలుగువారిని అణచివేసే విధంగా ప్రయత్నించడం బాధాకరమన్నారు. ఏపీకి అప్పులు, తెలంగాణాకు ఆస్తులు ప్రకటించి రాష్ట్రాన్ని బీజేపీ ప్రభుత్వం ఎంతో చిన్నచూపు చూసిందన్నారు. తెలుగువారి ఆత్మాభిమానాన్ని ఇబ్బందులపాలు చేయడాన్ని శివరామరాజు తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రంలో వైసీపీ హక్కుల పోరాటానికి సహకరించకపోగా బీజేపీకి కొమ్ము కాస్తోందని విమర్శించారు. భవిష్యత్‌లో కేంద్రంలో బీజేపీని గద్దె దించి రాష్ట్రానికి రావాల్సిన హామీలు నెరవేర్చుకునేదాకా విశ్రమించేదిలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శివప్రసాద్‌యాదవ్, ఎంపీపీ ఆరేటి రత్నప్రసాద్, డీసీ ఛైర్మన్ తోట ఫణిబాబు, గుండాబత్తుల నాగేశ్వరరావు, వేగేశ్న కాశీ విశే్వశ్వరరాజు, అడ్డాల పద్మావతి, వీరవల్లి శ్రీనివాస్, కందులపాటి వీరరాఘవులు, కందుల మల్లికార్జునరావు, బండారు వేణుగోపాలరావు, కట్రెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా కోసం టీడీపీ నిరసన ప్రదర్శన, రాస్తారోకో
జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 1: తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద రోడ్డుపై బైఠాయించి శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. పార్టీ శ్రేణులంతా నల్లబ్యాడ్జిలు ధరించి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిరసన ప్రదర్శన చేసారు. అనంతరం జరిగిన రాస్తారోకోలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షేక్ ముస్త్ఫా మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్రమోడి 2014 ఎన్నికల ప్రచారంలో ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి సభలో శ్రీ వేంకటేశ్వరస్వామి సాక్షిగా బీజేపీ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోపాటు విభజన చట్టంలోని హామీలు అన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ నేటి వరకు హిందువుల పవిత్రమైన తిరుపతిలో ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చలేని అసమర్థ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అని విమర్శించారు. 2014లో ఏపీ రెవెన్యూ లోటు రూ.16వేల కోట్లు ఉండగా ఇప్పటికీ రూ.4వేల కోట్లు, రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.62వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికి కేవలం రు.1500 కోట్లు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 24వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రు.1,050 కోట్లు మాత్రమే ఇచ్చి మిగిలిన వాటికి రావలసిన నిధులు ఇవ్వకుండా ఏపీ అభివృద్ధికి అడ్డుగా నిలిచిన నరేంద్రమోదీ తన నిజస్వరూపం బయటపెట్టుకున్నారని, ఆయన నిర్వాకం ఆంధ్రప్రజలు గమనించి రాబోవు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మండవ లక్ష్మణరావు, పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు నంబూరి రామచంద్రరాజు, వందనపు హరికృష్ణ, తూటికుంట దుర్గారావు, అట్లూరి రామ్మోహనరావు, చెరుకూరి శ్రీ్ధర్, షేక్ యాకూబ్, తూటికుంట రాము, కంచర్ల రమేష్, బొంగు నాగేశ్వరరావు, అప్పికొండ సుబ్బారావు, పాకనాటి కాశీ, జీరెడ్డి నాగలక్ష్మి, బెజవాడ పద్మ తదితరులు పాల్గొన్నారు.
పారిశ్రామికవేత్త వెలమాటికి కలెక్టర్ అభినందనలు
ఏలూరు, ఫిబ్రవరి 1: ఏలూరు ప్రభుత్వాసుపత్రికి రూ.40 కోట్లు విరాళం ఇచ్చిన ప్రముఖ పారిశ్రామికవేత్త వెలమాటి చంద్రశేఖర్ జనార్దన్‌రావును జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అభినందించారు. స్థానిక రెడ్‌క్రాస్ తలసేమియా విభాగంలో శుక్రవారం రాత్రి జనార్దన్‌రావుకు కలెక్టర్ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. సమాజంలో పేదల సంక్షేమానికి కృషి చేస్తున్న జనార్దన్‌రావు దాతృత్వాన్ని దాతలు ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో భాగస్వాములు కావాలని ప్రవీణ్‌కుమార్ కోరారు. జనార్దన్‌రావు ఏలూరు ఆసుపత్రి అభివృద్ధికి రూ.42 కోట్లకు పైగా దానం చేయడం ఎంతో గొప్ప విషయమని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, నగరపాలక కమిషనర్ మోహనరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు శలాకోట వీరయ్య, డాక్టర్ రావి గోపాలకృష్య, మానవత నాగేశ్వరరావు, కడుపు కన్నయ్య, తనే్నరు బుజ్జి, కృష్ణారావు, బొల్లినేని నారాయణ, మధుబాబు పాల్గొన్నారు.