జాతీయ వార్తలు

మా దౌత్య సిబ్బంది కలిసే అవకాశమివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: అమెరికాలో అక్కడి భద్రతా విభాగం అధికారులు అదుపులోకి తీసుకున్న తమ దేశ విద్యార్థులను తమ కాన్సులేట్ సిబ్బంది కలుసుకోవడానికి అవకాశం ఇవ్వాలని భారత్ కోరింది. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనా యంత్రాంగం ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. అమెరికాలో భారతీయ విద్యార్థుల అరెస్టుతో తలెత్తిన పరిస్థితిపై ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ పేర్కొన్నారు. నకిలీ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను చేర్పించిన వారికి, ఈ ప్రక్రియలో మోసపోయిన విద్యార్థులకు మధ్య వ్యత్యాసాన్ని గమనించవలసిన అవసరాన్ని కూడా భారత్ అమెరికా అధికారుల దృష్టికి తీసుకెళ్లిందని ఆయన తెలిపారు. కేవలం అమెరికాలో నివసించాలనే ఉద్దేశంతో అక్కడి నకిలీ విశ్వవిద్యాలయంలో చేరిన 130 మంది విదేశీ విద్యార్థులను అమెరికా అధికారులు అరెస్టు చేశారు. వారిలో అధిక సంఖ్యలో భారతీయ విద్యార్థులు ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) ఏజెంట్లు బుధవారం వారిని అరెస్టు చేశారు. ‘విద్యార్థులను అరెస్టు చేసిన సమాచారం అందుకున్న వెంటనే మా మిషన్ అమెరికా విదేశాంగ శాఖను, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటి అధికారులను సంప్రదించడం జరిగింది. అరెస్టు అయిన మొత్తం మంది విద్యార్థుల జాబితాను, వారి గుర్తింపు వివరాలు, వారిని నిర్బంధంలో ఉంచిన స్థలం వంటి వివరాలను తమకు అందజేయాల్సిందిగా వారిని కోరడం జరిగింది’ అని రవీశ్ కుమార్ తెలిపారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల అరెస్టుతో తలెత్తిన పరిస్థితిపై భారత ప్రభుత్వం వాషింగ్టన్‌లోని ఇండియన్ మిషన్, అమెరికాలోని ఇండియన్ కాన్సులేట్లతో కలిసి పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.