జాతీయ వార్తలు

మోదీ నినాదాలతో మార్మోగిన లోక్‌సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: లోక్‌సభ శుక్రవారం మోదీ నినాదాలతో మారుమోగిపోయింది. ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పియూష్ గోయల్ 2019-20 వార్షక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను సభలో ప్రతిపాదిస్తూ సంవత్సరాదాయం ఐదు లక్షల రూపాయలున్న వారు ఆదాయం పన్ను చెల్లించవలసిన అవసరం లేదని ప్రకటించగానే అధికారపక్ష సభ్యులు మూకుమ్మడిగా లేచి మోదీ.మోదీ..మోదీ.. అంటూ నినాదాలు చేశారు. రెండు నిమిషాలపాటు సభ దద్దరిల్లింది. దీంతో మంత్రి గోయల్ ప్రసంగాన్ని కాసేపుఆపాల్సి వచ్చింది. అధికార పక్షం సభ్యులు మోదీ నినాదాలు ఇస్తుంటే ప్రతిపక్షం వౌనంగా కూర్చున్నారు.
ప్రావిడెంట్ ఫండ్, నిర్ధేశిత ఈక్విటీల్లో లక్షన్నర రూపాయలను పొదుపు చేయగలిగితే సంవత్సరాదాయం 6.5 లక్షల రూపాయలున్నప్పటికీ ఐటీ చెల్లించవలసిన అవసరం లేదని గోయల్ ప్రకటించినప్పుడు కూడా అధికారపక్ష సభ్యులు మోదీకి అనుకూలంగా నినాదాలు ఇచ్చారు. అధికార పక్షం సభ్యులు నినాదాలు ఇస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ చిరునవ్వులు చిందించటంతోపాటు విజయ సూచికంగా ఒక చేయితో బల్లపై కొతుతూ ఆనందించారు.