జాతీయ వార్తలు

గుడి కట్టేవరకూ విశ్రమించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్, ఫిబ్రవరి 1: అయోధ్యలో రామాలయాన్ని నిర్మించేవరకు హిందువులు విశ్రమించరని విశ్వహిందూ పరిషత్ శుక్రవారం ఇక్కడ ఒక తీర్మానాన్ని చేపట్టింది. అయోధ్యలో శ్రీరాముడి జన్మస్థలంలో ఆలయాన్ని నిర్మించి తీరాలని, అంతవరకు తాము విశ్రమించమని, అలాగే ఇతరులను ప్రశాంతంగా ఉండనివ్వమని ఈ తీర్మానంలో వీహెచ్‌పీ ధర్మ సంసధ్ తేల్చిచెప్పింది. కుంభమేళా జరుగుతున్న ప్రదేశంలోనే ఈ ధర్మ సభను నిర్వహించిన వీహెచ్‌పీ రామజన్మభూమి-బాబరీ మసీదు భూ వివాదాన్ని తేల్చడంలో సుప్రీంకోర్టులో జరుగుతున్న జాప్యాన్ని దుయ్యబట్టింది. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వ తీరును కూడా విమర్శించారు. రెండురోజుల ఈ సభ ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంతంలోని వివాద రహిత మిగులు భూమిని తిరిగి ఇచ్చేయడానికి అనుమతించాలంటూ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ వేయడాన్ని ప్రశంసించింది. రామాలయం విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం సాధువుల్లో ఉందని, ఈ పిటిషన్‌ను దాఖలు చేయడం ద్వారా కేంద్రం తన చిత్తశుద్ధిని చాటుకుందని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. ఇప్పటికే రామాలయం నిర్మాణం విషయంలో తీవ్ర జాప్యం జరిగిందని, అయితే, హిందువు ఆత్మాభిమానానికి సంబంధించిన అంశాలు, అలాగే రామాలయం నిర్మాణం విషయంలో కేంద్రం అర్ధవంతమైన నిర్ణయం తీసుకోగలదన్న ఆశాభావాన్ని ఈ సదస్సు వ్యక్తం చేసింది. ఇంతకుముందు ఈ సదస్సును ఉద్దేశించిన మాట్లాడిన ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ‘రామాలయ నిర్మాణాంశం నిర్ణయాత్మక దశకు చేరుకుంది’ అని పేర్కొన్నారు.
ఇప్పటివరకు చేపట్టిన అనేక కార్యక్రమాల ఫలితంగా ఆలయ నిర్మాణానికి చేరువయ్యామని, ఈ దశలో ఆచితూచి అడుగువేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు. ఆలయం కోసం ఉద్యమిస్తున్న సంస్థలు, వ్యక్తులు లక్ష్యానికి దూరం కాకూడదని పిలుపునిచ్చిన ఆయన ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవాలను తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అవసరమైతే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి కూడా వెనుకాడకూడదని హిందూ శ్రేణులకు ఆయన సూచించారు. మరో ఆరు నెలల పాటు ఇందుకు సంబంధించి వేచిచూడడం మంచిదేనని పేర్కొన్న ఆయన ఆ తర్వాత మాత్రం ఆలయ నిర్మాణం సాగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పొరుగు దేశాలకు చెందిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం పొందే అవకాశాన్ని కల్పిస్తూ కేంద్రం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడం మంచి పరిణామమని ఆయన అన్నారు. శబరిమల విషయంలో సుప్రీంకోర్టు తొందరపాటుతో వ్యవహరించిందని కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్ విమర్శించారు.
అయోధ్య విషయంలో మాత్రం ప్రాధాన్యతాపూర్వకంగా వ్యవహరించడం లేదని అన్నారు. కాగా, ఈ ధోరణి వల్ల మెజారిటీ హిందువుల్లో సుప్రీంకోర్టు పట్ల నమ్మకం సడలిందని మహంత్ రామ్‌జీదాస్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి పేరుతోనే మళ్లీ అధికారంలోకి రావడం అన్నది మోదీ ప్రభుత్వానికి ఎంతమాత్రం సాధ్యం కాదని శ్యామ్ దేవచార్య మహారాజ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘రామభక్తులు వారి జీవితాలను త్యాగం చేస్తున్నారు. అలాంటపుడు అధికారంలోనున్న వ్యక్తులు తమ కుర్చీలను ఒదులుకోలేరా?’ అని ఆయన ప్రశ్నించారు.