హైదరాబాద్

వీర జవాన్.. అమర్ రహే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : భారత్ మాతా కీ జై..జై జవాన్.. వీర్ జవాన్ అమర్ రహే.. మీ త్యాగాలను మరువం.. అనే నినాదాలు శుక్రవారం సాగర తీరన మారుమోగాయి. రెండు రోజుల క్రితం కాశ్మీర్ పూల్వామాలో భారత సైనికులపై తగిన ఉగ్రదాడిలో ఏకంగా 45 మంది జవాన్లు అమరులు కావటం, మరి కొంత మంది క్షతగాత్రులు కావటాన్ని భాగ్యనగరం జీర్ణించుకోలేకపోతోంది. ఇంతటి క్రూరమైన ఉగ్ర దుశ్చర్యను మానవతా వాదులు, ప్రజాస్వామ్యవాదులు, నగరవాసులు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడుల్లో అమరులైన వీర సైనికులకు నివాళులర్పించేందుకు సాగర తీరానికి వేలాది మంది నగరవాసులు తరలి వచ్చారు. ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా పలు ప్రజాసంఘాలు కొవ్వొత్తుల ప్రదర్శనను నిర్వహించాయి. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా చేసిన నినాదాలతో సాగర్ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. శుక్రవారం ఉదయం నగరంలోని పలు పాఠశాలలు, పలు కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్‌మెంట్లు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళి అర్పించారు. మరికొన్ని ప్రాంతాల్లో నగర పౌరులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, మిలిటరీ, పోలీసు సిబ్బంది అమరవీరులకు నివాళి అర్పించి, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిత్యం ప్రపంచ శాంతిని ఆకాంక్షించే భారతదేశంపై ఈ రకమైన దాడులకు పాల్పడిన పాకిస్తాన్‌కు గుణపాఠం నేర్పే సమయం వచ్చిందని క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న యువకులు, పోలీసులు వ్యాఖ్యానించారు.