హైదరాబాద్

నుమాయిష్‌కు తగ్గని ప్రజాదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సకల సౌకర్యాలున్నా చదువుకోలేని వారు కొందరు.. ఎంతో కష్టపడి చదవాలనుకున్న వారి కుటుంబ పరిస్థితులు సహకరించక బాధపడే విద్యార్థులు మరికొందరు. చదువు పట్ల ఆసక్తి, శ్రద్ధ కల్గిన వారిని ప్రోత్సహించేందుకు నేనున్నానంటూ చేయూతనిస్తోంది అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్). పేద విద్యార్థులకు ఆర్థికంగా చేయూతనందించాలన్న మహా సంకల్పంతో ప్రతి ఏడాది నిర్వహిస్తున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు ఏళ్లు గడుస్తున్నా, వినియోగదారుల ఆదరణ తగ్గటం లేదు. కాలక్రమేనా వేల సంఖ్యలో స్టాళ్లను పెంచుకుని నేడు ప్రపంచ దృష్టినే ఆకట్టుకుంటుంది.
ఆరు నుంచి 2700 స్టాళ్లకు..
1938లో కేవలం ఆరు స్టాళ్లలో హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రారంభమైన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నేడు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సుమారు 2700 స్టాళ్లతో వినియోగదారులకు అన్ని రకాల వస్తువులను అందుబాటులోకి తెచ్చింది. రోజురోజుకి ప్రదర్శన స్థాయి విస్తరిస్తున్న కొద్దీ, అందుకు తగిన విధంగానే సందర్శకులకు వౌలిక వసతులు కల్పించింది. నగరంలోని చిన్న పాటి కుటీర పరిశ్రమ ఉత్పత్తులు మొదలుకుని ఇతర దేశాలకు చెందిన పలు కంపెనీలకు సైతం స్టాళ్లను కేటాయిస్తున్నారు. చిన్న తరహా పరిశ్రమలకు సైతం అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యాన్ని సైతం కల్పించే ఘనత నుమాయిష్‌కే దక్కింది.
చిన్నారులకు
అమ్యూజ్‌మెంట్ జోన్
సాధారణంగా ప్రదర్శనలు, జాతర అంటే చిన్నారులు, మహిళలదే జోరుగా ఎక్కువగా కన్పిస్తోంది. పారిశ్రామిక ప్రదర్శన కూడా చిన్నారులకు మానసిక ఉల్లాసాన్ని కల్గించేందుకు తగిన ప్రాధాన్యతనిచ్చింది. చిన్నారుల కోసం ఇక్కడ ప్రత్యేకంగా అమ్యూజ్‌మెంట్ జోన్‌ను ఏర్పాటు చేశారు. జాయింట్ వీల్స్, కొలంబస్, వెల్ ఆఫ్ డెత్, కప్ సాసర్, క్యామిల్, బౌన్సర్, రేంజర్, రంగులరాట్నం వంటివి చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వయోవృద్థులు, సరిగ్గా నడవలేని వారు సైతం ఈ చుక్ చుక్ రైలులో కూర్చోని ప్రదర్శనలోని అన్ని స్టాళ్లను తిలకించే అవకాశం కల్పించారు. తెలంగాణ పర్యాటక శాఖ, ఏర్పాటు చేసే కట్టడాల నమూనాలు, హస్త కళలు, ఇతర కళాఖండాలు సందర్శకుల ఆదరణ పొందుతున్నాయి.
అడుగడుగున నిఘా
పారిశ్రామిక ప్రదర్శనకు లక్షల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. వీరిలో చిన్నపిల్లలు, మహిళలు ఎక్కువ మంది ఉంటారు. వీరి భద్రత కోసం ఎగ్జిబిషన్ సొసైటీ, నగర పోలీసు శాఖ సంయుక్త్ధ్వార్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. గడిచిన కొద్ది సంవత్సరాల నుంచి రహస్యంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రదర్శనలోని ప్రతి సందర్శకుడి కదలికలను గమనిస్తూ, అందులో అనుమానాస్పదంగా కన్పించే వారిని, మహిళలను, యువతల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. గ్రౌండ్ లోపల 30 చెక్‌పోస్టులు, అడుగడుగున నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని అన్ని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక పోలీసులు ఇక్కడ విధులు నిర్వర్తించేలా బందోబస్తు కార్యచరణను రూపొందించారు.
ప్రతిభకు పట్టం
కుటీర, చిన్నతరహా పరిశ్రమలు సైతం తయారు చేసిన పలు వస్తువులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ కల్పించటంతో పాటు సందర్శకుల్లోని విభిన్న కళ, క్రీడాంశాలకు సంబంధించిన ప్రతిభను ప్రోత్సహించటంలో కూడా ఈ ప్రదర్శన తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తోంది. చిన్నారులు, మహిళలకు రంగోలి, యువతీయువకులకు క్రీడాపోటీలు నిర్వహించింది. వెల్‌బెబీ షో, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు కూడా నిర్వహించింది. సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న 18 కాలేజీల్లోని విద్యార్థులకు కూడా వారి ప్రతిభకు తగిన విధంగా ప్రోత్సాహాకాలు ఈ నుమాయిష్ జరిగే రోజుల్లోనే బహుకరించటం విశేషం.
బాధితులకూ అపన్నహస్తం
పారిశ్రామిక ప్రదర్శన నిర్వహించి, దాంతో వచ్చిన ఆదాయంతో విద్యాలయాల నిర్వహణతోపాటు కాలవైపరీత్యాలు సంభవించి కూడు, గుడ్డ, గూడు కొల్పోయిన బాధితులకు సైతం అండగా నిలుస్తోంది. కొద్ది ఏళ్ల క్రితం జరిగిన జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు రూ. 20లక్షలను ఆర్థికంగా సహాయంగా అందజేసింది. పోలీసుల సంక్షేమానికి రూ. 10లక్షలను అందజేయటంతో పాటు ఫైర్ విభాగానికి సైతం ఆర్థిక సహయాన్ని అందజేస్తూ ఈ సొసైటీ తన ఉదారతను చాటుకుంటుంది. హైదరాబాద్ పాతబస్తీలోని గౌలీపురా, మొఘర్‌పురాల్లోని ప్రభుత్వ పాఠశాలలను దత్తతకు తీసుకుంది.
ఎనిమిది రోజులు పొడిగింపు
నుమాయిష్‌లో గతంలో ఎన్నడూ లేనివిధంగా గత నెల 30వ తేదీన అగ్నిప్రమాదం జరిగి 300 స్టాళ్లు దగ్ధమయ్యాయ. తిరిగి ఈ స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు రెండురోజులు ప్రదర్శనను నిలిపివేశారు. అదనంగా మరో ఎనిమిది రోజులు, అంటే ఈనెల 24వ తేదీ వరకు పొడిగించి, పెంచిన రోజుల్లో వచ్చే ఆదాయంతో స్టాళ్లు, కాలిపోయి నష్టపోయిన వ్యాపారులను ఆదుకుంటామని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది.
సకల సౌకర్యాలు కల్పించాము
‘ప్రదర్శనలో స్టాల్స్ ఏర్పాటు చేసిన వ్యాపారుల కోసం ఎగ్జిబిషన్ సొసైటీ సకల సౌకర్యాలు కల్పించింది. నూమాయిష్‌ను తిలకించేందుకు వచ్చే వారి భద్రతపై గట్టి నిఘాను ఏర్పాటు చేశాము. దాదాపు 500 మందితో స్పెషల్ సెక్యూరిటీని నియమించాము. ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకుల్లో వికలాంగులు, వయోవృద్దుల సౌకర్యర్థం వీల్ చైర్‌లను కూడా అందుబాటులో ఉంచాము. 79వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో ఇప్పటివరకు మొత్తం 2700 స్టాల్స్ ఏర్పాటుచేశామని తెలిపారు.’
- ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి రంగారెడ్డి