రాష్ట్రీయం

ఎంపీ కవితకు మరో అరుదైన అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఫిబ్రవరి 16: నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అరుదైన గౌరవాన్ని దక్కించుకోనున్నారు. ఇప్పటికే ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డును అందుకున్న ఆమెకు, ఐక్యరాజ్య సమితి సమ్మిట్‌లో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం అందింది. మార్చి 1వ తేదీన యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్ స్థానిక సంస్థ, గ్లోబల్ నెట్‌వర్క్ ఇండియాలు న్యూఢిల్లీలో నిర్వహించనున్న లింగ సమానత్వ సమ్మిట్(జెండర్ ఈక్వాలిటీ సమ్మిట్-2019) లో ప్రసంగించేందుకు ఎం.పీ కవిత ఎంపికయ్యారు. లింగ సమానత్వం కోసం చేస్తున్న కృషిని, ఎస్‌డీజీ లక్ష్యాల సాధనకై కొనసాగిస్తున్న ప్రయత్నాలను గుర్తిస్తూ ఆమెను ఈ సమ్మిట్‌లో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానించారని ఎం.పీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ సమ్మిట్‌లో నాలెడ్జ్ భాగస్వామిగా వ్యవహరిస్తున్న డెలాయిట్‌తో కలిసి 4వ పారిశ్రామిక విప్లవం కోసం మహిళలను సిద్ధం చేయడం, భారతదేశంలో లింగ సమానత్వం అవార్డులను ప్రదానం చేసే పద్ధతులపై చర్చించనున్నారు. ప్రభుత్వ అధికారులు, అకాడమీలు, పౌర సమాజ సంస్థలు, ఎన్‌జీవోలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొని బ్లూప్రింట్‌ను రూపొందించనున్నారు. నాల్గవ పారిశ్రామిక విప్లవం వ్యాపార, సాంకేతిక, ఆటోమేషన్, బిగ్ డేటా, వృద్ధి చెందిన మానవ-డిజిటల్ ఇంటర్‌ఫేస్ పాత్ర క్రియాశీలకంగా మారిన నేపథ్యంలో భారతదేశ యువత కూడా ఆయా రంగాల్లో తగిన నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఉపాధి పరంగా, నైపుణ్యాల సముపార్జనలో అవకాశాలు అంతంతమాత్రంగానే ఉండే మహిళలను ప్రోత్సహిస్తూ ఆయా రంగాల్లో వారు పురోగమించేందుకు, సాంకేతికంగా పట్టును సాధించేందుకు, విద్యా విధాన మార్పులు తదితర అంశాలపై ఈ సదస్సులో కూలంకశంగా చర్చించనున్నారు. కాగా, ఐక్యరాజ్య సమితి గ్లోబల్ కాంపాక్ట్ స్థానిక ఆర్క్, గ్లోబల్ కాంపాక్ట్ నెట్‌వర్క్ ఇండియా(జీసీఎన్‌ఐ) మన దేశ వ్యాపారాలు, విద్యా సంస్థలు, పౌర సమాజ సంస్థలకు బాధ్యతాయుతమైన వ్యాపార విధానాలతో వాటిని బలోపేతం చేయడానికి కలిసికట్టుగా పని చేసే ఒక వేదికగా వ్యవహరిస్తోంది. 2015లో రూపొందించబడిన మానవ హక్కులు, కార్మికులు, పర్యావరణం, అవినీతి రహిత సమాజ నిర్మాణం వంటి ఉదాత్తమైన లక్ష్యాల కోసం ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ప్రయత్నాలు చేస్తాయి. 193 సభ్య దేశాల్లో తీవ్ర పేదరికం, అసమానత, అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు భారతదేశంతో సహా ఐక్యరాజ్య సమితి సభ్యు దేశాలు కలిసి పని చేస్తున్న విషయం విదితమే.