రాష్ట్రీయం

చేయూతనివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలను ఆర్థికంగా బరోపేతం చేసేందుకు, ప్రజలకు వౌలిక సదుపాయాలు కల్పించేందుకు వీలుగా ఎక్కువ నిధులు లభించేలా చూడాలంటూ స్థానిక సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌కు సోమవారం వచ్చిన 15వ ఆర్థిక కమిషన్‌కు వివిధ సంస్థల ప్రతినిధులు నివేదికలు అందచేశారు. గ్రామ పంచాయతీలు, మండల ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రజాపరిషత్తులు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్ల ప్రతినిధులు 15వ ఆర్థిక కమిషన్ చైర్మన్ నంద కిషోర్ సింగ్‌తో పాటు సభ్యులతో వివరంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్ గొడిసెల రాజేశం గౌడ్ ఈ చర్చల్లో కీలకపాత్ర పోషించారు. స్థానిక సంస్థలకు ఇస్తున్న తలసరి నిధులు 400 రూపాయలే ఉన్నాయని, దీన్ని మూడింతలు పెంచుతూ 1200 గా నిర్ణయించేలా చూడాలని కేంద్ర ఆర్థిక కమిషన్‌ను స్థానిక సంస్థల ప్రతినిధులు కోరారు. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి తదితరులు ఆర్థిక కమిషన్ చైర్మన్‌తో మాట్లాడారు. 14వ ఆర్థిక కమిషన్ సిఫార్సుల ప్రకారం లభించిన నిధులు ఆశాజనకంగా లేవని తెలిపారు. అందువల్లనే ఎక్కువ మొత్తంలో నిధులు లభించేందుకు సిఫార్సు చేయాలని ప్రతినిధులు కోరారు. మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలకు లభిస్తున్న నిధుల్లో 65 శాతం వరకు సొంత పన్నుల ద్వారా లభిస్తోందని ప్రభుత్వ నివేదికలు తెలియచేశాయి. రాష్ట్రంలో 142 పట్టణ స్థానిక సంస్థలు ఉండగా, 13,198 గ్రామీణ స్థానిక సంస్థలు ఉన్నాయని ప్రభుత్వం తెలియచేసింది. పట్టణ నగర పాలక సంస్థలకు 14 వ ఆర్థిక కమిషన్ ద్వారా 2711.12 కోట్ల రూపాయలు బేసిక్ గ్రాంట్‌గా, 677.78 కోట్ల రూపాయలు పెర్ఫార్మెన్స్ గ్రాంట్‌గా లభించాయి. అలాగే గ్రామీణ స్థానిక సంస్థలకు 14 వ ఆర్థిక కమిషన్ సిఫార్సుల ద్వారా బేసిక్ గ్రాంట్‌గా 4837.75 కోట్ల రూపాయలు, పెర్ఫార్మెన్స్ గ్రాంట్‌గా 537.53 కోట్ల రూపాయలు లభించాయి. ఈ నిధులు చాలా తక్కువని, ప్రజల అవసరాలను, వౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని నిధుల కేటాయింపు మూడు రెట్లు పెరిగేలా చూడాలని 15 వ ఆర్థిక కమిషన్‌ను వివిధ సంస్థల ప్రతినిధులు కోరారు.
తెలంగాణలో పరిశ్రమ అభివృద్ధి, ఐటి రంగం అభివృద్ధి పట్ల 15 వ ఆర్థిక కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది. పరిశ్రమ ప్రతినిధులు, ఈటాప్సి, సీఐఐ, టీఐఎఫ్ ప్రతినిధులతో 15 వ ఆర్థిక కమిషన్ ప్రత్యేక సమావేశంలో చర్చించింది. పరిశ్రమల పెరుగుదల, ఐటీ రంగం పరిస్థితి, ఆర్థికాంశాలపై చర్చించింది. జీఎస్‌టీ అమల్లో తెలంగాణలో పురోభివృద్ధి బాగా ఉందని కితాబిచ్చారు. జీఎస్‌టీకి పూర్వం ఉన్న డీలర్ల సంఖ్యతో పోలిస్తే జీఎస్‌టి అమల్లోకి వచ్చిన తర్వాత డీలర్ల సంఖ్య 37.4 శాతం పెరగడం మంచిపరిణామనని పేర్కొన్నారు. తెలంగాణలో జీఎస్‌టీ రెవెన్యూ 20 శాతం పెరిగిందని, ఆంధ్రప్రదేశ్‌లో ఈ పెరుగుదల 14.7 శాతం మాత్రమే ఉందని కమిషన్ గుర్తు చేసింది. నైపుణ్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాల పట్ల కమిషన్ చైర్మన్ నందకిషోర్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.
నేడు ప్రభుత్వంతో చర్చలు
15 వ ఆర్థిక కమిషన్ చైర్మన్, సభ్యులతో మంగళవారం రోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం అవుతారు. అలాగే ప్రభుత్వ సలహాదారు (ఆర్థిక) జీఆర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కే. జోషి, ఆర్థిక శాఖ అధికారులతో చర్చిస్తారు.
చిత్రం..హైదరాబాద్‌లో సోమవారం చైర్మన్ నందకిశోర్‌సింగ్ అధ్యక్షతన సమావేశమైన 15 ఆర్థిక సంఘ సభ్యులు