ఆంధ్రప్రదేశ్‌

లాభసాటి వ్యవసాయం ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 18: నదుల అనుసంధానంతో సత్ఫలితాలు వస్తున్నాయని, సమర్థ నీటి నిర్వహణతో అధిగ దిగుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచి నీరు-ప్రగతిపై సోమవారం ఆయన అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు చేరటం ఒక చరిత్ర అని చెప్పారు. పలమనేరులో పండుగ వాతావరణం నెలకొందని, రైతులు జలసిరికి హారతులు పడుతున్నారంటూ సంతోషం వ్యక్తం చేశారు. జలవనరుల శాఖ ఇంజనీర్లు, సిబ్బంది సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందంటూ వారికి అభినందనలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు 66 శాతం పూర్తి చేశామని, 19 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి అయిందన్నారు. మరో నాలుగు ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. మొత్తం 62 ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తున్నామని, జల సంరక్షణ పనులు వేగవంతం చేయాలన్నారు. వర్షాకాలం లోపు పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. వేసవిలో మంచినీటి ఎద్దడి నివారించాలన్నారు. రాబోయే మూడు నెలలు మంచినీటిపై దృష్టి సారించాలని ఆదేశించారు. వర్షాభావంలోనూ సాగునీటి కొరత లేకుండా చేశామన్నారు.
ఇక మంచినీటి కొరత నివారణపై కూడా అందరం దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామాలు, వార్డుల్లో మంచినీటి రవాణాపై శ్రద్ధ చూపాలన్నారు. వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే మన ధ్యేయమన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 11శాతం వృద్ధి సాధించామని, రబీలో ఉత్పాదకత పెరిగేలా చూడాలన్నారు. విస్తీర్ణం తగ్గినా, ఉత్పాదకత పెంచితే లోటు భర్తీ అవుతుందన్నారు. మార్కెటింగ్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. అన్నదాత సుఖీభవ మార్గదర్శకాలు సిద్ధమని, కేంద్రం ఇవ్వని రైతులకు కూడా రాష్ట్రం ఆర్థిక చేయూత ఇస్తోందన్నారు. కౌలు రైతులకు, 5 ఎకరాలు పైబడిన వారికీ ఇస్తున్నామన్నారు. ఉపాధి హామీ పథకంతో పశుగ్రాసం సాగును ప్రోత్సహించాలన్నారు. ఎండుగడ్డి పంపిణీని కరవు మండలాల్లో ఎక్కువగా చేయాలన్నారు. గోకులాలు, మినీ గోకులాలపై రైతుల్లో ఆసక్తి ఉందన్నారు. పసుపు-కుంకుమ నిధులు విడుదల చేశామన్నారు. 2,175 కోట్ల రూపాయల మేర బ్యాంకుల్లో డిపాజిట్ చేశామని తెలిపారు. సిబ్బంది లేరని, నగదు లేదని ఇబ్బందులు పెట్టవద్దని బ్యాంకర్లకు సూచించారు. ప్రతిరోజూ బ్యాంకర్లతో ఈ పథకాన్ని సమీక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. డ్వాక్రా మహిళలకు ఇబ్బందులు రాకూడదన్నారు. నీతి ఆయోగ్ ర్యాంకుల్లో ఏపీ ముందుందన్నారు. సర్వీస్ డెలివరీలో నెంబర్-1 ర్యాంక్ సాధించామన్నారు. మిగిలిన అంశాల్లో రెండో ర్యాంక్ సాధించామన్నారు. వౌలిక సదుపాయాల అభివృద్ధికి ఒక అనువైన వాతావరణం కల్పించామన్నారు. స్ఫూర్తిదాయక సమయంలో ఉన్నామని, ఇదే స్ఫూర్తిని ఇకపై కూడా కొనసాగించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.