జాతీయ వార్తలు

కుప్పకూలిన విమానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఫిబ్రవరి 19: భారత వాయుసేన (ఐఏఎఫ్) ఏరోబాటిక్ టీమ్ సూర్య కిరణ్‌కు చెందిన రెండు విమానాలు మంగళవారం కూలిపోవడం వల్ల ఒక పైలట్ మృతి చెందాడు. మరో ఇద్దరు పైలట్లు గాయపడినప్పటికీ, ప్రాణాలతో బయటపడ్డారు. బెంగళూరులోని యెలహంక వైమానిక స్థావరానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయిదు రోజుల పాటు సాగే ఏరో ఇండియా షో బుధవారం ప్రారంభం కానున్న తరుణంలో మంగళవారం రిహార్సల్‌లో పాల్గొన్న సందర్భంగా ఈ ప్రమాదం జరిగిందని ఒక ఉన్నత స్థాయి పోలీసు అధికారి తెలిపారు. అయితే, కూలిపోవడానికి ముందు ఈ రెండు విమానాలు పరస్పరం ఢీకొన్నాయా? లేదా? అనేది తెలియరాలేదు. ‘ప్రమాదం జరిగినప్పుడు విమానాలలో ముగ్గురు పైలట్లు ఉన్నారు. వారిలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారికి ఎలాంటి ప్రాణహాని లేదు’ అని ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న డీజీపీ (ఫైర్ సర్వీసెస్) ఎం.ఎన్.రెడ్డి తెలిపారు. ఈ ప్రమాదంలో ఒక పౌరుడు కూడా గాయపడినట్టు ఆయన వివరించారు. మంగళవారం ఇక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఈ ప్రమాదం గురించి ప్రశ్నించ గా, దాని గురించి తనకు తెలుసని బదులిచ్చారు. అంతకు మించి ఆమె వివరాలు తెలపలేదు.

చిత్రం.. ఎయిర్‌ఫోర్స్ సూర్యకిరణ్ ఎరోబాటిక్ విమాన శిథిలాలు