రాష్ట్రీయం

9 గంటల విద్యుత్‌పై దృష్టి పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరాపై దృష్టి కేంద్రీకరించాలని వివిధ డిస్కంల అధికారులకు రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అజయ్ జైన్ ఆదేశించారు. విజయవాడలోని తన కార్యాలయం నుంచి వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరాపై డిస్కంల అధికారులతో గురువారం టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను 9 గంటలు చేశారని తెలిపారు. దీనివల్ల పంటలు నష్టపోకుండా మేలు జరుగుతుందన్నారు. రైతులకు 9 గంటల పాటు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. విద్యుత్ సరఫరాలో లోపాల వల్ల ఒక్క ఎకరా పంట కూడా నష్టపోకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. విద్యుత్ సరఫరాలో లోపాలు ఉంటే వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేయని ట్రాన్స్‌ఫారాలను ఆ రోజే తోలగించి కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. రబీ సీజనులో కరవు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 9 గంటల విద్యుత్ సరఫరా వల్ల ప్రభుత్వంపై 1500 కోట్ల రూపాయల మేర అదనపు భారం పడుతుందని, ఇప్పటికే 6000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని గుర్తు చేశారు. వివిధ వర్గాలకు ఉచితంగా విద్యుత్ సరఫరాపై కూడా దృష్టి సారించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ కనెక్షన్లను మార్చి నాటికి క్లియర్ చేయాలని ఆదేశించారు. 9 గంటల విద్యుత్ సరఫరా వల్ల డిమాండ్ రోజుకు 167 మిలియన్ల యూనిట్ల నుంచి 189 మిలియన్ యూనిట్లకు పెరిగిందన్నారు. ఈ టెలీకాన్ఫరెన్సులో ఎపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్, జేఎండీలు దినేష్ పరుచూరి, ఉమాపతి, సలహాదారు రంగనాథమ్ తదితరులు పాల్గొన్నారు.