ఆంధ్రప్రదేశ్‌

జగన్‌కు మోదీ, కేసీఆర్ సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 21: తెలుగుదేశం పార్టీని జగన్ ఒక్కడే ఎదుర్కొనలేరని భావించి ఆయనకు మోదీ, కేసీఆర్ సహకరిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, నక్కా ఆనందబాబు ఆరోపించారు. ఉండవల్లి ప్రజావేదిక వద్ద మంత్రులు గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ జగన్ ఒక క్రిమినల్ మనస్తత్వం కలిగిన వ్యక్తి అని, కేసీఆర్, మోదీ, జగన్ కలిసి టీడీపీని దెబ్బ తీయాలని చూస్తున్నారన్నారు. కేంద్రం విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. కుటుంబానికి ఎదుటివాళ్లు బాగుపడకూడదనేది జగన్ కుటుంబం ఉద్దేశమన్నారు. రాష్ట్రాన్ని దెబ్బ తీయాలన్నదే వారి లక్ష్యమని మండిపడ్డారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ భూముల దుర్వినియోగానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు. లక్ష కోట్లు దోచుకున్న జగన్ సొమ్ము రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర సొమ్మును దోచుకున్న జగన్‌కు ప్రజలు అధికారం ఇస్తారని అనుకోవడం లేదన్నారు. ఇప్పటికీ వెనుకబడిన వర్గాలు టీడీపీ వెంటే ఉంటారన్నారు. మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ మోదీ శాసిస్తే, జగన్, కేసీఆర్ పాటిస్తారని ఎద్దేవా చేశారు. అధికారం జగన్‌కు ఎండమావిగానే మారుతుందన్నారు. కులాలను, వర్గాలను రెచ్చగొట్టి ఆశాంతికి గురి చేయాలని జగన్ గతంలో ప్రయత్నించారని, ఇప్పుడూ ప్రయత్నిస్తున్నారన్నారు. తండ్రి శవాన్ని దగ్గరపెట్టుకుని సీఎం పదవి కోసం సంతకాల సేకరణ చేసిన వ్యక్తి జగన్ అని ధ్వజమెత్తారు. మోదీకి దాసోహమై కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ ఎంగిలి మెతుకుల కోసం జగన్ కుట్రలు పన్నుతున్నారన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని, జగన్ అధికారం ఇస్తే, కుక్కలు చింపిన ఇస్తరిగా మారుతుందన్నారు.

చిత్రం.. మీడియాతో మాట్లాడుతున్న మంత్రులు యనమల, నక్కా ఆనందబాబు