తెలంగాణ

సాగుకు నీటి కోసం... ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వద్ద టీడీపీ భారీ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, ఫిబ్రవరి 22: కరీంనగర్ జిల్లాలోని గంగాధర, నారాయణపూర్ జలాశయాలకు నీరు విడుదల చేయాలని... నీరు లేక ఇక్కడి సాగు భూములన్నీ ఎండిపోతున్నాయని, వ్యవసాయ భూములకు శ్రీపాద ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా తెలుగుదేశం ఆందోళనకు దిగింది. శుక్రవారం పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వద్ద జలశయాలకు నీటి విడుదల కోసం తెలుగుదేశం పార్టీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్ ముందు ధర్నా చేపట్టింది. గంగాధర, నారాయణపూర్ జలాశయాలకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల చేసే దాకా ఊరుకునే సమస్యే లేదని పట్టుబడుతూ తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకులంతా ఇక్కడ భీష్మించుకు కుర్చున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోజి రెడ్డి మాట్లాడుతూ... ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు నీరు సరఫరా చేయకుండా పక్క జిల్లాలకు నీరును దర్జాగా సరఫరా చేసుకుంటున్నారని, ఇది పూర్తి స్థాయిలో మోసమని మండిపడ్డారు. గంగాధర, నారాయణపూర్ జలాశయాలకు ఎల్లంపల్లి నీరు విడుదల చేసిన్నట్లయితే ఈ జలాశయాల నుంచి సాగులోకి వచ్చే వేలాది ఎకరాల భూములకు సాగునీరు అందుతుందని, ఈ విషయానిన తెరాస ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ మెదక్ జిల్లాలకు నీటిని సరఫరా చేసుకుంటుందని ఆగ్రహించారు. పదే పదే కేసీ ఆర్ ప్రభుత్వం మాది రైతు ప్రభుత్వమని, రైతు సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వమని చెప్పుకోవడం తప్ప రైతన్నలకు చేసిన మేలు ఏమీ లేదని జ్యోజి రెడ్డి అన్నారు. ఇప్పటికైనా తెరాసా ప్రభుత్వం వివక్షను విడనాడి జలశయాలకు ఎల్లంపల్లి నీటిని విడుదల చేయాలని, లేని పక్షంలో రైతుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ముందుండి ఉద్యమాలు నిర్వహిస్తుందని హెచ్చరించారు. కరీంనగర్ కన్వీనర్ కయ్యాడపు ఆగయ్య, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర సత్యంతోపాటు రాష్ట్ర నాయకులు పర్లపల్లి రవీందర్, కరుణాకర్ రెడ్డి, నాగుల బాల గౌడ్, రాజేశం, బసాలత్, వేముల రాజేశం, శ్రావణ్‌తోపటు గంగాధర, కొత్తపల్లి, నారాయణపూర్ మండలాలకు చెందిన నేతలు సాంబ శివరెడ్డి, రామక్రిష్ణా రెడ్డి, కన్నూరి పద్మ, వాసాల తిరుపతి, సాన బేగం, లక్ష్మణ్ రావు, రాజమల్లయ్య, కాంతయ్య పాల్గొన్నారు.