తెలంగాణ

పాఠశాలల్లో కానరాని ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, ఫిబ్రవరి 22 : స్వార్థ సంకుచిత భావాలకు దూరంగా, కులమతాలకు అతీతంగా, భారతావని ప్రాచీన సంస్కృతికి ప్రతి బింబాలుగా నిలుస్తున్న ఉత్సవాలపై పాఠశాలల్లో, నిర్లక్ష్యపు నీడలు కమ్ముకుంటున్నాయి. పాఠశాల బోధన, హాజరు, పరీక్షలకే పరిమితమవుతూ, బోధనేతర అంశాలకు తగు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విమర్శలు నానాటికీ అధికమవుతున్నాయి.
ప్రతి ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో విధిగా నిర్వహించవలసిన ఉత్సవాలను పొందుపరుస్తూ, జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డుల ద్వారా ప్రచురితమైన పాఠశాల దర్శినిని పాఠశాల లన్నింటికీ సరాఫరా చేసినా, అది అమలుకు నోచుకున్న దాఖలాలే లేవు. జూలై రెండవ పక్షంలో వనమహోత్సవం, 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం, ఆగస్టు 9న క్విట్ ఇండియాడే, 15న స్వాతంత్య్ర దినోత్సవం, 29న జాతీయ క్రీడా దినోత్సవం, సెప్టెంబర్ నెలలో 5న గురుపూజాదినోత్సవం, 8న అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం, 16న ప్రపంచ ఓజోన్ దినోత్సవం, 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం, ఆక్టోబర్‌లో 2న గాంధీ జయంతి, 4న ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం, 24న ఐక్యరాజ్యసమితి దినోత్సవం, 31న జాతీయ పునరంకిత దినం, నవంబర్ 7నుండి 14 వరకు గ్రంథాలయ వారోత్సవాలు, 14న బాలల దినోత్సవం, 19న జాతీయ సమైక్యతా దినం, 19నుండి 25 వరకు నేషనల్ బుక్ వీక్, డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినం, 10న మానవ హక్కుల సంరక్షణ దినం, జనవరి 26న గణతంత్ర దినం, ఫిబ్రవరిలో స్వయం పరిపాలనా దినోత్సవం, పాఠశాల వార్షికోత్సవములు, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం తదితర కార్యక్రమాలను నిర్వహించాలని సూచించడం జరిగింది. అంతేగాక ఐక్యరాజ్య సమితిచే ఎంపిక చేయబడిన ప్రపంచ ఆరోగ్య, మహిళా, పరిసరాల, అంగవికలుర మరియు సంఘ సంస్కర్తల, స్వాతంత్య్ర సమరయోధుల తదితర ప్రముఖుల జన్మదినములు, సంస్మరణ దినములు జరుపుకోవాలని సూచించడం జరిగింది. ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యా కమీషనర్ మరియు డైరెక్టర్ ఉత్తర్వులను అనుసరించి, ప్రభుత్వ, స్థానిక అన్ని సంస్థలకు చెందిన అన్ని ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి సంవత్సరం డిసెంబర్ లేదా జనవరి నెలలో ఎలాంటి ఖర్చుకు తావీయకుండా, వార్షికోత్సవాలను నిరాడంబరంగా నిర్వహించాలని సూచించారు.
ప్రైవేటు విద్యాసంస్థలకు, ప్రభుత్వ పాఠశాలలు ఏ రకంగానూ తీసిపోవనీ, వాటి కంటే తక్కువ కాదనే భావనను విద్యార్థులలో కల్పించే కార్యక్రమం తమ సంస్థలలో చేపట్టడం ప్రధానోపాధ్యాయులు గర్వకారణంగా భావించాలని సూచించారు. స్థానిక సీనియర్ ప్రభుత్వ అధికారులు, అనధికారులు, ప్రజా ప్రతినిధులను వార్షికోత్సవాలకు ఆహ్వానించి, వారిని భాగస్వాములను చేయాలని సూచించారు.