తెలంగాణ

ఎమ్మెల్సీ అభ్యర్థిగా సత్యవతి రాథోడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, ఫిబ్రవరి 22: డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ కోటా తెరాస అభ్యర్థుల జాబితాలో చొటు దక్కించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్ టికెట్ ఆశించి భంగబడిన సత్యవతి రాథోడ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లో కచ్చితంగా న్యాయం చేస్తామంటూ మాట ఇచ్చారు. వారిపై నమ్మకంతో డోర్నకల్ ఎమ్మెల్యేగా పోటీచేసిన రెడ్యానాయక్ విజయం కోసం ఎంతగానో కృషిచేశారు. తమ మాటను గౌరవించిన సత్యవతికి ఇచ్చిన మాటను అదేస్థాయిలో నిలుపుకోవాలనే ఆలోచనతో కేసీఆర్ తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ సత్యవతి పేరును జాబితాలో చేర్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆపార్టీలో పనిచేసిన సత్యవతిరాథోడ్ కురవి మండలంలోని గుండ్రాతిమడుగు శివారు పెద్దతండాకు చెందినవారు. సత్యవతి 1989లో డోర్నకల్ ఎమ్మెల్యేగా తొలిసారి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్ధి రెడ్యానాయక్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ టీడీపి పార్టీలో కొనసాగుతూ అంచలంచెలుగా రాష్టస్థ్రాయిలో గుర్తింపు సాదించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో రెడ్యానాయక్‌ను ఓడించడం ద్వారా రాష్టస్థ్రాయిలో గుర్తింపు సాదించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పిలుపు మేరకు టీడీపి ఎమ్మెల్యేగా ఉంటూనే సత్యవతి గులాబి తీర్ధం పుచ్చుకున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి రెడ్యానాయక్ చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. అనూహ్యంగా రెడ్యానాయక్ తెరాసలోకి రావడంతో సత్యవతి రాజకీయంగా కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నమ్మకంతో తెరాసలోనే కొనసాగారు. 2018 ఎన్నికల్లో టీకెట్ కోసం తీవ్రంగా పోటీపడ్డప్పటికీ సిట్టింగ్‌లకే సీట్లు ఖాయం అని తేల్చడంతో మరోసారి అలకబూనారు. ఆ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లు జోక్యం చేసుకొని సత్యవతిని స్వయంగా తమ ఇంటికి పిలిచి మాట్లాడారు. కచ్చితంగా న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. రెడ్యానాయక్ ఎమ్మెల్యేగా విజయం సాదించడంతో సత్యవతి ప్రతిష్ట మరింత పెరిగింది. ప్రతీ సందర్భంలోనూ తమ ఆదేశాలకు కట్టుబడి నడుచుకుంటున్న సత్యవతిరాథోడ్‌పై ప్రత్యేక అభిమానం కనబర్చిన పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో ఆమె పేరును ప్రకటించారు. దీంతో డోర్నకల్ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో సత్యవతి అనుచరులు శుక్రవారం భాణాసంచా పేల్చి సంబురాలు జరుపుకున్నారు. పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలుగకుండా కేసీఆర్‌పై ఉన్న నమ్మకంతో తాను పనిచేశానని తన నమ్మకానికి, విదేయతకు గుర్తింపుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఈ అవకాశాన్ని కల్పించారని సత్యవతి రాథోడ్ అన్నారు.