క్రీడాభూమి

బ్యాటింగ్‌లో మేటి గేల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ప్రతి సీజన్‌లోనూ ఎక్కువ పరుగులు సాధించిన అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌కు ఆరెంజ్ క్యాప్, ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా పర్పుల్ క్యాప్‌లను బహూకరిస్తారు. ఆరెంజ్ క్యాప్‌లను 2008లోషాన్ మార్ష్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్/ 11 మ్యాచ్‌ల్లో 616 పరుగులు), 2009లో మాథ్యూ హేడెన్ (చెన్నై సూపర్ కింగ్స్/ 12 మ్యాచ్‌ల్లో 572), 2010లో సచిన్ తెండూల్కర్ (ముంబయి ఇండియన్స్/ 15 మ్యాచ్‌ల్లో 618), 2011లో క్రిస్ గేల్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు/ 12 మ్యాచ్‌ల్లో 608), 2012లో క్రిస్ గేల్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు/ 15 మ్యాచ్‌ల్లో 733), 2013లో మైక్ హస్సీ (చెన్నై సూపర్ కింగ్స్/ 16 మ్యాచ్‌ల్లో 733), 2014లో రాబిన్ ఉతప్ప (కోల్‌కతా నైట్ రైడర్స్/ 16 మ్యాచ్‌ల్లో 660), 2015లో డేవిడ్ వార్నర్ (సన్ రైజర్స్ హైదరాబాద్/ 14 మ్యాచ్‌ల్లో 562 పరుగులు) ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నారు. క్రిస్ గేల్ రెండు పర్యాయాలు ఆరెంజ్ క్యాప్‌ను అందుకోవడం విశేషం.
బౌలింగ్ విభాగంలో పర్పుల్ క్యాప్‌ను 2008లో రాజస్థాన్ బౌలర్ సొహేల్ తన్వీర్ (11 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు), 2009లో రుద్ర ప్రతాప్ సింగ్ (డక్కన్ చార్జర్స్/ 16 మ్యాచ్‌ల్లో 23), 2010లో ప్రజ్ఞాన్ ఓఝా (డక్కన్ చార్జర్స్/ 16 మ్యాచ్‌ల్లో 21), 2011లో లసిత్ మలింగ (ముంబయి ఇండియన్స్/ 16 మ్యాచ్‌ల్లో 28), 2012లో మోర్న్ మోర్కెల్ (్ఢల్లీ డేర్‌డెవిల్స్/ 16 మ్యాచ్‌ల్లో 25), 2013లో డ్వెయిన్ బ్రేవో (చెన్నై సూపర్ కింగ్స్/ 18 మ్యాచ్‌ల్లో 32), 2014లో మోహిత్ శర్మ (చెన్నై సూపర్ కింగ్స్/ 16 మ్యాచ్‌ల్లో 23), 2015లో డ్వెయిన్ బ్రేవో (చెన్నై సూపర్ కింగ్స్/ 16 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు) పర్పుల్ క్యాప్స్‌ను స్వీకరించారు.