తెలంగాణ

రైతులవద్ద పత్తి అయిపోయాక కేంద్రాలు మూయొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: రాష్ట్రంలో రైతుల వద్ద పత్తి లేదని నిర్ధారించుకున్న తర్వాతనే పత్తి కొనుగోలు కేంద్రాలను మూసివేయాలని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి ఆదేశించారు. వ్యవసాయ, మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, గిడ్డంగుల శాఖల జిల్లాస్థాయి అధికారులతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పత్తి, కందులు, సెనగలు తదితర పంటల ఉత్పత్తులను రైతుల నుండి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సూచించారు.
ఇప్పటికే పత్తి కొనుగోలు దాదాపు పూర్తయిందని, అయితే రైతుల వద్ద పత్తి పూర్తిగా అయిపోయిందని నిర్ధారించుకున్న తర్వాతనే పత్తికొనుగోలు కేంద్రాలను మూసివేయాలని, ఈ విషయాన్ని ముందుగా జిల్లా కలెక్టర్లకు తెలియచేయాలని ఆదేశించారు. 2018-19 సీజన్‌లో 1,35,862 మంది రైతుల నుండి 1936 కోట్ల రూపాయల విలువైన 3,57,821 టన్నుల పత్తి కొనుగోలు చేశామని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ జి. లక్ష్మీబాయి తెలిపారు. అలాగే 130 కొనుగోలు కేంద్రాల ద్వారా 88 వేల టన్నుల కందులు కొన్నామన్నారు. 34,500 టన్నుల సెనగలను కొనుగోలు చేసేందుకు ప్రణాలిక రూపొందించామన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ అనుబంధ శాఖల రాష్టస్థ్రాయి అధికారులు కూడా పాల్గొన్నారు.