తెలంగాణ

బీజేపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని వ్యూహాత్మకంగా చేపడుతున్నారు. నిన్నటికి నిన్న మెట్రో రైలులో తిరిగి ప్రయాణీకుల నుండి అభిప్రాయ సేకరణ చేసిన నేతలు శనివారం నాడు భారీ బైక్‌ర్యాలీని నిర్వహించారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య కళా భవన్ నుండి ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా విజయ్ సంకల్ప దివస్ కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. మోదీ ఐదేళ్లలో ప్రవేశపెట్టిన పథకాలను ప్రచారం చేయడానికి ఈ బైక్ ర్యాలీ చేశామని అన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని అన్నారు. గత 70 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వమూ చేయని పనులను తాము చేశామని అన్నారు. కుల వృత్తులకు 3వేల రూపాయిల పెన్షన్ అందజేస్తున్నామని పేర్కొన్నారు. మార్చి నెలలో అమిత్ షా, ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి వస్తారని పేర్కోన్నారు. ప్రాంతీయ పార్టీలు అన్నీ కుటుంబ పార్టీలుగా మిగిలిపోయాయని, రైతులకు అన్ని వర్గాల ప్రజలకు చేయూతనిచ్చిన ప్రభుత్వం మోదీ ప్రభుత్వమని అన్నారు. కాంగ్రెస్ హయాంలో చేయలేని ఎన్నో పనులను తాము చేసి చూపించామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో పూర్తి మెజార్టీ అందిస్తే ప్రపంచ దేశాల్లో భారత్‌ను నరేంద్రమోదీ ప్రభుత్వం ధీటుగా తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు.
తప్పులు దిద్దండి
ఎన్నికల ఓటర్ల జాబితాల్లో ఉన్న తప్పులను దిద్దాలని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లోని ఓటర్ల జాబితా నుండి ఎలాంటి పరిశీలనలు లేకుండానే వేలాది మంది ఓటర్లను తొలగించారని ఆరోపించారు.