మెయిన్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ కసాయివాడు దానిని క్రూరముగా గొట్టుటవలన ఆవు వానిని తిప్పలు పెట్టసాగెను. దానిని తోలుకొనిపోవుట వానికి బహుదుర్ఘటమైనది. అట్లు చాలసేపు శ్రమపడి మధ్యాహ్నమునకు ఎట్లో ఒక గ్రామము చేరుకొనెను. చాల అలసిపోయి సమీపమున నున్న యొక ధర్మసత్రమునకు వెడలి అచట నీయబడు సదా వృత్తిలో పాల్గొనివాడు. తృప్తిగా తినుటచే బాగుగా తేఱుకొని సులభముగా ఆవును వధశాలకు జేర్పగలిగినాడు. ఆ గోవును హత్యచేసిన పాపములో కొంత భాగము కసాయి వానికి అన్నదానము చేసిన దాతకు ప్రాప్తించినది. కాబట్టి అన్నదానాదులలో గూడ దానమును గ్రహించువాడు దానిని దుర్మార్గకృత్యములకై వినియోగించు దుష్టుడు కాడుగదాయని వివేచించి మఱి చేయుచుండవలయును.
385. విధి యిట్టిది: పూర్వజన్మమున బాగుగా దానధఱ్మములను జేసినవారు ఈ జన్మమున భాగ్యవంతులై పుట్టుచుందురు. కాని రుూ ప్రపంచము భగవంతుని మాయ. మాయ యనేక అక్రమములతో గూడుకొనియున్నది. మాయ నెవ్వరును గ్రహింపజాలరు.
వస్తధ్రారణ: ఆహారము
386. సన్న్యాసులు కాషాయ వస్త్రాములను ధరించుట ఎందులకు, వస్తధ్రారణలో ఏమున్నది? కాషాయ వస్తమ్రులు మనసులో పవిత్ర భావములను స్ఫురింపజేయును. అఱిగిపోయిన చెప్పులను చినిగిపోయిన బట్టలను దాల్చినవానికి తనయొక్క దైన్యస్థితి తలపునకు వచ్చును; నీటగు కోటులను లాగులను విలువగల బూటులను తొడిగినప్పడు సహజముగా నెవ్వడైనను అహంభావముతో పొంగుచుండును. నల్లంచు సన్నని రవసెల్లా ధోవతిని గట్టినయెడల అయ్యది వానికి ఎక్కడలేని ఉల్లాసమును పురికొల్పును. అట్టివాడు శృంగార కీర్తనలను గూడ పాడుచుండును. కాషాయ వస్తమ్రుల దాల్చుటచే సహజముగా మనసున పవిత్ర భావములు స్ఫురించును. స్వతఃవస్తధ్రారణలో ఏమిశేషము లేకున్నను ఆయా వేషములచే ఆయా భావములు గలుగుచుండును.
387. మొక్కను కంచె వేసి కాపాడవలయును. లేని యెడల మేకలును అల్లరి పిల్లలును దానిని ధ్వంసము చేయవచ్చును. కాని ఆ మొక్క పెద్ద చెట్టయినపిమ్మట మేకల మందగాని ఆవుల మందగాని స్వేచ్ఛగా దాని విశాలమైన కొమ్మలనీడను విశ్రమింపవచ్చును, దాని ఆకులను పొట్టనిండ మేయవచ్చును. (చెట్టునకు ఏమియు అపాయము ఉండదు.) అట్లే భగవంతుని యందు నీయొక్క శ్రద్ధ్భాక్తులు ఇంకను బీజావస్థలోనో, అంకురావస్థలోనో ఉండగా దుష్టసాంగత్యమును ఐహిక చింతలును వానిని పాడుచేయకుండ సంరక్షించుకొనవలయును. కాని నీ భక్తిశ్రద్ధలు దృఢపడిన పిమ్మట ఏయైహిక చింతగాని, ఏ దుష్ప్రవృత్తిగాని నిన్ను సమీపింప వెఱచును. నీ సాన్నిధ్యమే అంతటి పవిత్రమైయొప్పును. నీ సాంగత్య మహిమచే దుర్మార్గులనేకులు దైవభక్తులుగా మాఱగలరు.
388. ఒక విద్యార్థి శ్రీరామకృష్ణుని సందర్శించి యిట్లు ప్రశ్నించెను: ‘‘అయ్యా, ఒకే దేవుడు సర్వభూతములందును సంస్థితుఁడైయుండ ఎవని చేతి యాహారమును గైకొనినను హానియేమి?’’ శ్రీగురుదేవుడు, ‘‘నీవు బ్రాహ్మణడవా?’’యని యడుగనాతడు, ‘‘ఔ’’ననియెను. అంత గురుదేవుడిట్లనియెను: ‘‘అందువలననే నీవు నన్నట్లడిగినావు. నీవొక అగ్గిపుల్లను వెలిగించి దానిపై ఇన్ని యెండుగట్టెలను పడవైచితివనుకొనుము. ఏమగును?’’ ‘‘వానిచే గప్పబడి నిప్పు ఆఱిపోవును’’అని విద్యార్థి బదులుచెప్పెను. మఱల గురుదేవుడిట్లనియెను: ‘‘కార్చిచ్చు మండుచుండగా ఇన్ని పచ్చి అరటిబోదెలను తెచ్చి దానిలో పడవేసితివనుకొనుము. అవి యేమగును?’’
- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి