జాతీయ వార్తలు

కన్నుల పండువగా పద్మ పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఈ ఏడాదికి గానూ రెండో విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం శనివారం ఘనంగా జరిగింది. మొత్తం 112 మందికి కేంద్రం ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించగా, వీరిలో 47 మంది ఈ నెల 11న మొదటి విడతలో అవార్డులు అందుకున్నారు. మిగిలిన వారికి శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి అందజేశారు. శాస్ర్తియమైనా, ప్రణయమైనా, సందేశాత్మక గీతమైనా తనదైన శైలిలో పద ప్రయోగాలు చేసే సీనీ గేయ రచయిత సిరివెనె్నల సీతారామశాస్ర్తీ పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అలాగే భారత పుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ చెత్రీ కూడా పద్మశ్రీ అందుకున్న వారిలో ఉన్నారు. వీరిద్దరు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన విషయం తెలిసిందే. జానపద గాయని తీజన్ బాయి, ఇస్రో శాస్తవ్రేత్త నారాయణ్, మహాశయ్ ధరంపాల్ గులాటిలకు పద్మభూషణ్ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేశారు. పర్వతారోహకురాలు బచెంద్రిపాల్, ప్రముఖ హిందీ నటుడు మనోజ్ బాజ్‌పాయ్, స్వపన్ చౌధు రి, ఆర్చర్ బంబాయ్‌లా దేవి లైశ్రమ్, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, హెచ్‌ఎస్ పూల్కా పద్మశ్రీ అందుకున్నారు.
చిత్రం.. ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాలు అందుకున్న విజేతలతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ.