తెలంగాణ

రాబోయేది సంకీర్ణ యుగమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, మార్చి 18: దేశంలో రాబోయేది సంకీర్ణ యుగమేనని, మరోసారి ప్రాంతీయ పార్టీలు ఏలబోతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. సోమవారం నగరంలోనిర్వహించిన విలేఖరుల సమావేశంలోమాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ రూపకర్తగా, ప్రత్యేక రాష్ట్ర సాధకునిగా, నిబద్ధత కలిగిన పాలకుడిగా రాష్ట్ర దశ,దిశను మార్చిన ఆయన దేశానికి మార్గదర్శిగా మారబోతున్నారని అన్నారు. ఏడు దశాబ్దాల కాంగ్రెస్, బీజేపీ పాలనలోసాధించలేని ప్రగతి కేవలం నాలుగున్నరేళ్ళ కాలంలోమాత్రమే పూర్తి చేసి, దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా మారాడని అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్ తెలంగాణ అని దేశ ప్రజలు చర్చించుకునే రోజులు వచ్చాయని, నాడు ద్వేషించిన సీమాంధ్ర ప్రజలే నేడు సీ ఎం కేసీ ఆర్ పాలనను కీర్తిస్తూ పొగుడుతున్నారన్నారు. ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు జిల్లా ప్రజలు మరోసారి ఉద్యుక్తులవుతున్నారని, ఉద్యమ శ్రీకారానికి ఉప్పందించిన జిల్లా పరిధిలోని మూడు పార్లమెంటు స్థానాలు గెలిపించి, కేసీ ఆర్‌కు బహుమతిగా అందించేందుకు సిద్ధమవుతున్నారని అన్నా రు. కరీంనగర్ స్థానాన్ని చరిత్రలో లిఖించదగ్గ మెజార్టీని ఎంపీ వినోద్‌కు అందించేందుకు కార్యచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. మార్పు కోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్న ముఖ్యమంత్రి కేసీ ఆర్ వెంట జిల్లావాసులు మరోసారి అడుగు ముందుకేసేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సతీష్‌బాబు, సుంకె రవిశంకర్, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్‌రావు, ఐడిసి చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్, జిల్లా పరిశీలకుడు బస్వరాజు సారయ్య, తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్