రాష్ట్రీయం

ఫెడరల్ ఫ్రంట్ ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు లోక్‌సభ ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి మహ్మద్ షబ్బీర్ అలీ విమర్శించారు. లోగడ కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికై, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఏ మేరకు అమలు చేశారో కేసీఆర్ వివరించాలని సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు. 2014లో జరిగిన ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలనూ విస్మరించారని కేసీఆర్‌పై షబ్బీర్ అలీ విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు ఒక్క డీఎస్సీని కూడా నిర్వహించలేదని, డబుల్ బెడ్ రూం ఇండ్ల జాడ లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల ఫిరాయింపు ఎంపీలను కలుపుకొని మొత్తం 15 మంది ఉన్నా, రాష్ట్రానికి ఏమి సాధించారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. కనీసం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా సాధించలేక పోయారని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తారని, ఢీల్లీకి వెళ్ళి మోకరిల్లుతారని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి కొనుగోలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధైర్యం ఉంటే ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సవాలు విసిరారు. ఆ జిల్లా ప్రజల మద్దతు ఎవరికి ఉందో తెలుస్తుందన్నారు.