జాతీయ వార్తలు

నేనూ చౌకీదార్‌నే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: ‘నేనూ కాపాలాదారుడినే’ అనే ప్రచార ఉద్యమాన్ని జనంలోకి ఉధృతంగా తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. ఈ నెల 31న దేశంలో 500 నగరాల ప్రజల నుద్దేశించి ‘నేనూ కాపాలాదారుడినే’ అనే కార్యక్రమం ద్వారా నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల చేత ‘నేనూ కాపాలాదారుడినే’ అంటూ ప్రతిజ్ఞచేయించనున్నారు. మంగళవారం ఇక్కడ కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ విలేఖర్లతో మాట్లాడుతూ ‘నేనూ వాచ్‌మెన్‌నే’ అనే కార్యక్రమం ఉద్యమంగా మారిందని.. నేనూ కాపాలాదారుడినే అనే పిలుపుకు 20 లక్షల మంది స్పందించారన్నారు. 1680కోట్ల హిట్స్ వచ్చాయన్నారు. గత శనివారం ‘నేనూ కాపాలాదారుడినే’ అంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం విదితమే. ట్వీట్ అకౌంట్లలో కూడా చౌకీదార్ నరేంద్ర మోదీ అని మార్చుకున్న సంగతి విదితమే. బీజేపీ నాయకుల అకౌంట్లలో వారి పేర్లకు ముందు చౌకీదార్ అని చేర్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారంలో బీజేపీ ఈ పేరును విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ నెల 31న ప్రధానమంత్రి మోదీ రైతులు, వివిధ వర్గాల ప్రజలు, ప్రొఫెషనల్స్, ఆయా రంగాలకు చెందిన నిపుణులతో మాట్లాడుతారు. ఈ ఉద్యమంలో కాంగ్రెస్ నేతలు కూడా చేరాలని ఆయన కోరారు.