జాతీయ వార్తలు

కాంగ్రెస్, ఆప్ మధ్య పవార్ సయోధ్య చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ ప్రయత్నాలు మొదలెట్టారు. ఢిల్లీలో కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేస్తేనే బీజేపీని నిలువరించగలుగుతామని నమ్ముతున్న పవార్ రెండు పార్టీలను కలిపేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిసింది. ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌తో సీట్ల సర్దుబాటు చేసుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అధినాయకత్వం ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు చేసుకునేందుకు ఆప్ అధినాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తీవ్రంగా కృషి చేసినా కాంగ్రెస్ హైకమాండ్ విముఖత చూపుతూ ఆయనతో కలిసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో త్రిముఖ పోటీ తప్పదని అందరు భావిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు శరద్ పవార్ రంగ ప్రవేశం చేయటంతో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. శరద్ పవార్ మంగళవారం తన నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌తో చర్చలు జరిపారు. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీతో ముఖాముఖి పోటీ జరిగేలా చూసేందుకు అనుసరించవలసిన వ్యూహం గురించి ఇరువురూ చర్చలు జరిపారు. బీజేపీని ఓడించాలంటే అన్ని ప్రతిపక్షాలు కలిసి ఒకే తాటిపైకి వచ్చి ఒక్క అభ్యర్థినే రంగంలోకి దించాలన్నది పవార్ ఆలోచన. ఈ లక్ష్య సాధన కోసం మొదట కాంగ్రెస్, ఆప్ మధ్య సయోధ్య కుదుర్చాలన్నది ఆయన ఆలోచన. కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేస్తే బీజేపీ సునాయాసంగా గెలుస్తుందని ఆయన అంటున్నారు. బీజేపీ గెలుపునకు అడ్డుకట్టవేయాలంటే కాంగ్రెస్, ఆప్ సీట్ల సర్దుబాటు చేసుకోవాలని ఎన్‌సీపీ అధినేత భావిస్తున్నారు. శరద్ పవార్ ఇది వరకే కాంగ్రెస్ అథ్యక్షుడు రాహుల్ గాంధీతో ఇదే విషయంపై చర్చించినట్టు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తే ఆ తరువాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇది కలిసి వస్తుందన్నది పవార్ వాదన. ఎన్‌సీపీ అధినేత సూచన మేరకు ఢిల్లీ కాంగ్రెస్ ఇంచార్జ్ పీసీ చాకో ఆప్ పార్టీ సినియర్ నాయకులతో చర్చలు జరుపుతున్నారు.