జాతీయ వార్తలు

నీట్ రద్దు.. ప్రైవేటు కోటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 19: తమిళనాడులోని డీఎంకే పార్టీ మంగళవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. వైద్య కళాశాల్లో ప్రవేశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీట్ రద్దు చేయిస్తామని పార్టీ హామీ ఇచ్చింది. అలాగే ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పిస్తామని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే విద్యారుణాలన్నీ మాఫీ చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే చిన్న, సన్నకారు రైతుల పంట రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని డీఎంకే మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. అలాగే రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు సబ్సిడీపై ఇస్తామని స్టాలిన్ హామీ ఇచ్చారు. జాతీయ ప్రవేశ పరీక్ష ‘నీట్’ను తమిళనాడు మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు నీట్‌కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. 2017లో దళిత విద్యార్థిని ఎస్ అనితకు ఇంటర్‌లో 1200 మార్కులకు 1176 వచ్చినా నీట్‌లో మంచి ర్యాంక్ రాలేదు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. అయులూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన మొత్తం రాష్ట్రానే్న కుదిపేసింది. రోజువారీ కూలీ అయిన అమ్మాయి తండ్రి నీట్‌పై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌కు ఇంప్లీడ్ అయ్యాడు. అనిత ఆత్మబలిదానంపై తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలూ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టాయి. అన్నాడీఎంకే ప్రభుత్వం విద్యార్థులకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇదే అంశం డీఎంకే మేనిఫెస్టోలో ప్రధానంగా చోటుచేసుకుంది. ‘గ్రామీణ, పేద, అట్టడుగు వర్గాల ప్రజల ప్రయోజనాలను నీట్ దెబ్బతీస్తోంది. ఇది తమిళనాడుకే కాదు యావత్ భారత్‌లో ఇదే పరిస్థితి ఉంది. విద్యార్థులకు సామాజిక న్యాయం కల్పించాలన్న ఉద్దేశంతోనే నీట్ రద్దుకు కృషి చేస్తాం’ అని స్టాలిన్ వెల్లడించారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
చిత్రం..డీఎంకే కార్యాలయంలో పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తున్న పార్టీ అధ్యక్షుడు స్టాలిన్, కనిమొళి